ఇవాళ ఒక బ్యానర్ లో ఒక సినిమా పూర్తి చేసే సరికే దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థలు వచ్చేస్తున్నాయి. షూటింగ్ ప్రారంభోత్సవం నాడు ఆనందంగా కొబ్బరికాయ కొట్టే దర్శక నిర్మాతలు, షూటింగ్ చివరి రోజు గుమ్మడికాయ కొట్టే సమయానికి అంతే సయోధ్యతో ఉంటారా? అంటే అనుమానమే! అయితే దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ మాత్రం అందుకు భిన్నం. ఆయన ఒకే బ్యానర్ లో వరుసగా రెండేసి సినిమా చేస్తూ సాగుతుండటం విశేషం.
Read Also : Rashmika: నా భర్త అతడే.. లవ్ మ్యారేజ్ కన్ఫర్మ్ చేసిన రష్మిక
‘నాటకం’ సినిమాతో కళ్యాణ్ జీ గోగణ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాను నిర్మించిన రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లోనే తన రెండో సినిమా ‘సుందరి’ రూపొందించారు కళ్యాణ్ జీ. ఆ తర్వాత ‘కాదల్’, ‘తీస్ మార్ ఖాన్’ చిత్రాలను రూపొందించారు. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆది సాయికుమార్, కళ్యాణ్ జీ గోగణ కాంబినేషన్ లో ‘తీస్ మార్ ఖాన్’ చిత్రాన్ని విజన్ సినిమాస్ అధినేత నాగం తిరుపతి రెడ్డి తెరకెక్కించారు. ‘తీస్ మార్ ఖాన్’ సెట్స్ పై ఉండగానే, కళ్యాణ్ జీ వర్కింగ్ స్టయిల్ నచ్చి వెంటనే మరో చిత్రం నిర్మించడానికి తిరుపతి రెడ్డి సిద్ధమయ్యారు. ఒకే బ్యానర్ లో ఇలా రెండేసి సినిమాలు చేసే అవకాశం రావడం తన అదృష్టమని, అది తన నిర్మాతల సహృదయతకు నిదర్శనమని కళ్యాణ్ జీ గోగణ చెబుతున్నారు.