హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా డెవిల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అభిషేక్ నామా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా సో సో రిజల్ట్ నే సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్‌గా అదరగొట్టాడు కళ్యాణ్ రామ్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌తో దుమ్ములేపాడు. దీంతో… బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కలిసి మరో మంచి సినిమా చేసారనే టాక్ వినిపించింది, ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అయితే సలార్ మేనియా ముందు డెవిల్ ఆగలేదు, ఓవరాల్ గా థియేట్రికల్ రన్ లో లో డెవిల్ సినిమా 23 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. సంక్రాంతి పండక్కి కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో డెవిల్ సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయిపొయింది.
డిసెంబర్ 29న థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు నుంచి డెవిల్ మూవీ స్ట్రీమ్ అవుతోంది. థియేటర్స్ లో డెవిల్ సినిమాని మిస్ అయిన వాళ్ళు… కొత్త సినిమాల టికెట్స్ దొరకని వాళ్లు డెవిల్ సినిమా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. ఇదిలా ఉంటే డెవిల్ మూవీ రిలీజ్ రోజున చేసిన సెలబ్రేషన్స్‌లో భాగంగా… డెవిల్ 2 కూడా ఉంటుందని అనౌన్స్ చేశాడు కళ్యాణ్ రామ్. ‘డెవిల్ 2 ఉంటుంది. నా టీమ్ మెంబర్స్‌తోనే ఉంటుంది. 2024లో డెవిల్ 2 మొదలుపెట్టి 2025లో రిలీజ్ చేస్తాం. డెవిల్2 లో 1940 ఎరా.. 2000 ఎరా కూడా కనిపిస్తుంది. ఈ రెండు కాలాలు కలిపి చూడబోతున్నారు…’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికైతే NKR21 వర్కింగ్ టైటిల్‌తో మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.