Kalki 2898 AD Sequel: ఎట్టకేలకు మొదలెట్టేశారు..పిక్స్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త విజువల్ వండర్‌గా నిలిచిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం (Kalki 2 Sequel) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా ప్రారంభమైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈసారి రెండో భాగాన్ని మరింత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ లేటెస్ట్ షెడ్యూల్‌ను లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ (సుప్రీం యాస్కిన్) పై చిత్రీకరిస్తున్న కీలక సన్నివేశాలతో మొదలుపెట్టారు.
మొదటి భాగంలో కేవలం అతిథి పాత్రలా కనిపించిన యాస్కిన్ పాత్ర, రెండో భాగంలో అసలైన విలన్ గా అలరించబోతున్నాడు. కమల్ హాసన్ లుక్, ఆయన నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
Also Read:Pradeep Ranganathan: చేతిలో 8 సినిమాలు.. ₹25 కోట్ల రెమ్యునరేషన్! అయినా డేట్ల కోసం నిర్మాతల క్యూ
Also Read
- Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..'వృషకర్మ' వెనుక అసలేం జరిగింది?
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
ముంబై మరియు హైదరాబాద్‌లోని ప్రత్యేక సెట్స్‌లో ఈ చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్లోనే అత్యంత బిజీ ఫేజ్‌లో ఉన్నారు. ఆయన నటించిన మూడు భారీ చిత్రాలు ప్రస్తుతం ఒకే సమయంలో సెట్స్‌పై ఉండటం విశేషం.
ప్రస్తుతం కమల్ హాసన్, అమితాబ్ లు తమ భాగం షూటింగ్లో పాల్గొంటుండగా, ప్రభాస్ మరికొన్ని రోజుల్లో ఈ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. తన ఇతర చిత్రాల షెడ్యూల్స్ పూర్తి చేసుకొని, ‘భైరవ’గా మళ్ళీ కల్కి ప్రపంచంలోకి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వనున్నారు.
మొదటి భాగం అందించిన ఉత్సాహంతో, సీక్వెల్లో విజువల్ ఎఫెక్ట్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. కథలో ఉన్న సస్పెన్స్, అశ్వత్థామ మరియు భైరవ మధ్య ఉండే పోరాట ఘట్టాలు ఈసారి నెక్స్ట్ లెవల్లో ఉంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
-
Train Passengers Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 6 గంటల పాటు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు బంద్!
-
Congress Protest: రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని పార్టీ నేతల ధర్నా..
-
Karnataka MLC Election Results: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీజేపీ పంచ్.. క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ-జేడీఎస్ కూటమి.!
-
UP MLC Election Results: సంచలనం.. ప్రధాని మోదీకి షాక్..! వారణాసిలో బీజేపీ ఓటమి..
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!