Kajol : 26 ఏళ్ల తర్వాత.. మ్యారేజ్ లైఫ్ కి ఎక్స్పైరీ డేట్ ఉండాలి అంటున్న.. కాజోల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి కాజోల్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. “పెళ్లికీ ఒక ఎక్స్పైరీ డేట్, రెనివల్ ఆప్షన్ ఉండాలి” అని ఆమె చేసిన కామెంట్ నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆమె పెళ్లయి 26 సంవత్సరాలు అయిన తర్వాత ఈ మాటలు రావడం విశేషం. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే సెలబ్రిటీ టాక్ షో తాజా ఎపిసోడ్లో నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాహం, సంతోషం, సంబంధాలు వంటి ఆసక్తికర అంశాలపై సరదాగా చర్చ సాగింది.
Also Read : Kodamasimham re-release : ‘కొదమసింహం’ ట్రైలర్ రిలీజ్‌తో ఫ్యాన్స్ ఫిదా..
Also Read
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
ట్వింకిల్ ఖన్నా “వివాహానికి గడువు తేదీ, రెనివల్ ఆప్షన్ ఉండాలా?” అని ప్రశ్నించగా, కృతి, విక్కీ, ట్వింకిల్ ‘నో’ చెప్పి రెడ్ జోన్లో నిలిచారు. కానీ కాజోల్ మాత్రం ఆ ఆలోచనకు మద్దతుగా గ్రీన్ జోన్‌కి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్వింకిల్ వెంటనే “అది పెళ్లి.. వాషింగ్ మెషీన్ కాదు కదా!” అని చమత్కరించగా, కాజోల్ గంభీరంగా స్పందిస్తూ.. “నేను నిజంగానే అలా అనుకుంటున్నాను. మనం సరైన సమయంలో సరైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని ఎవరు హామీ ఇస్తారు? గడువు ఉంటే మనం ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు. అలాగే రెనివల్ ఆప్షన్ ఉంటే సంబంధానికి కొత్త అర్థం వస్తుంది.” అని చెప్పి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. తర్వాత ట్వింకిల్ మరో ఆసక్తికరమైన ప్రశ్న వేసింది — “డబ్బుతో ఆనందాన్ని కొనుగోలు చేయవచ్చా?” అని. దీనికి కాజోల్ ‘నో’ అనగా, ట్వింకిల్, విక్కీ ‘యెస్’ అన్నారు. కాజోల్ తన అభిప్రాయం చెబుతూ “డబ్బు ఎక్కువ ఉన్నా, అది కొన్నిసార్లు నిజమైన సంతోషాన్ని అర్థం చేసుకునే అవకాశం లేకుండా చేస్తుంది’’ అని చెప్పింది.
గేమ్ చివర్లో ట్వింకిల్ సరదాగా “బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి ఎక్స్‌లతో డేటింగ్ చేయకూడదు” అని చెబుతూ కాజోల్‌ను ఆటపట్టించింది. వెంటనే కాజోల్ నవ్వుతూ “నోరు మూయ్!” అంటూ సరదాగా మందలించింది. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ టాక్ షో లో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్, వరుణ్ ధావన్, అలియా భట్ తదితరులు పాల్గొననున్నారు. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ విడుదలవుతుంది.
తాజావార్తలు
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..