బాలీవుడ్ నటి కాజోల్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. “పెళ్లికీ ఒక ఎక్స్‌పైరీ డేట్, రెనివల్ ఆప్షన్ ఉండాలి” అని ఆమె చేసిన కామెంట్ నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆమె పెళ్లయి 26 సంవత్సరాలు అయిన తర్వాత ఈ మాటలు రావడం విశేషం. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే సెలబ్రిటీ టాక్ షో తాజా ఎపిసోడ్‌లో నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ అతిథులుగా…