అందాల సుందరి కాజల్ అగర్వాల్ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజల్ తో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని కాజల్ సోదరి నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ తో తెలియజేసింది. కాజల్‌తో కలిసి ఉన్న ఒక అందమైన పిక్ ను షేర్ చేస్తూ నిషా తన ఆనందాన్ని పంచుకుంది.
Read also : Radhe Shyam : సూపర్ కూల్ గా ఈ రాతలే సాంగ్ ప్రోమో
“అవును! ఇది అధికారికంగా అధికారికం.. నాకు మరో బిడ్డ పుట్టబోతోంది. ఇక్కడే ఈ గర్భంలో నేను తాకుతున్నాను. నా బిడ్డ నం 2 దారిలో ఉంది! నేను నిన్ను కలుసుకోవడానికి వేచి ఉండలేకపోతున్న లిటిల్ లవ్… కాజల్ అగర్వాల్ అండ్ గౌతమ్ కిచ్లు మీరు ఎప్పటికీ మంచి ఆరోగ్యంతో, బలంగా ఉండాలని కోరుకుంటున్నాను! మీరు కొత్త పాత్రలను పోషించి, ఈ అందమైన తల్లిదండ్రుల ప్రయాణాన్ని ప్రారంభించినందున మీ ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ నిషా షేర్ చేసిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే… ఆమె నటించిన “హే సినామిక”, “ఆచార్య” సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి.