The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The India Story : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా రేపు (జూలై 24న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు, తమిళ భాషల్లో విడుదల నిలిపివేసినట్లు తెలుస్తోంది. సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో వ్యవసాయ రంగంలో పురుగుమందుల వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలను మేకర్స్ చూపించనున్నారు. సమాజంలో చర్చకు దారితీసే అంశాన్ని స్టోరీగా ఎంచుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. తన కెరీర్లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్న కాజల్‌కు ఈ సినిమా మరో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా మారనుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇంకా పూర్తికాకపోవడంతో తెలుగు, తమిళ ప్రేక్షకులు ఈ సినిమాను ప్రస్తుతం అనుకున్న తేదీకి రిలీజ్ కావడం లేని సమాచారం. ప్రస్తుతానికి కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అనుకున్న తేదీకి విడుదల కానుందని చిత్ర బృందం నుంచి సమాచారం అందుతోంది. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ సినిమాను సాగర్ బి.షిండే నిర్మించారు. సామాజిక సందేశంతో తెరకెక్కిన ‘ది ఇండియా స్టోరీ’కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
- Prabhas 'Fauzi : 'ఫౌజీ' పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
- The PARADISE : 'ది ప్యారడైజ్' ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!