అందాల చందమామ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన తరువాత పలు సినిమాల నుంచి తప్పుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్ లోనే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు పోస్ట్ చేస్తోంది. అయితే ఈ బ్యూటీ తాజాగా ఓ కమర్షియల్ యాడ్ లో కన్పించింది. తొలిసారిగా టీవీ యాడ్ లోకి అడుగుపెడుతున్న ఓ ప్రెగ్నెన్సీ కిట్ కి సంబంధించినది ఆ యాడ్. ప్రస్తుతం కాజల్ కూడా ప్రెగ్నెన్సీ కావడం సదరు సంస్థకు కలిసొచ్చింది. ఈ యాడ్ ను తాజాగా కాజల్ తన సోషల్ మీడియాలో పంచుకుంది.
Read Also : Beast Twitter Talk : మూవీ ఎలా ఉందంటే ?
“Prega News ద్వారా ఖచ్చితమైన నిర్ధారణతో నేను కేవలం 5 నిమిషాల్లో నా శుభవార్తను తెలుసుకున్నాను ! లక్షలాది మంది భారతీయ మహిళలచే విశ్వసించబడినది… ఇది బ్రాండ్ మాత్రమే కాదు, భారతదేశపు నెం.1 ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్. ఇక వేచి ఉండకండి, ఈరోజే నిపుణుడిని ఇంటికి తీసుకురండి!” అంటూ కాజల్ ట్వీట్ చేసింది. ఇక ఈ యాడ్ చూసిన వారంతా ఈ టైంలో కూడా కాజల్ రెండు చేతులా సంపాదిస్తోంది అని, సమయానుకూలంగా ఇలాంటి యాడ్ లో కన్పించి ట్రెండ్ సెట్ చేస్తోందని అంటున్నారు.
With the expert's accurate confirmation with Prega News I received my Good News in just 5 mins! Trusted by millions of Indian women,this is not just any brand, but India's No.1 Pregnancy Detection Kit.Don't wait anymore bring the expert home today! #Accurate #Rapid #PregaNews #ad pic.twitter.com/CHfyY8L1UG
— Kajal Aggarwal (@MsKajalAggarwal) April 13, 2022