K.S.Prakash Rao Jayanthi Special: కె.యస్.ప్రకాశరావు స్క్రీన్ ప్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో స్క్రీన్ ప్లే రాయడంలో దిట్ట అనిపించుకున్నవారు బహుకొద్దిమందే! వారిలో నటదర్శకనిర్మాత కె.యస్.ప్రకాశరావు స్థానం ప్రత్యేకమైనది. మొదటి నుంచీ ఆయన పాశ్చాత్య చిత్రాలను అధ్యయనం చేసి, వాటిలోని స్క్రీన్ ప్లే అంశాలను తాను తెరకెక్కించే చిత్రాలకు అనువుగా మలచుకొనేవారు. తన దర్శకత్వంలో రూపొందిన ‘దీక్ష’ (1951) నాటి నుంచీ ఆయన అదే పంథాలో సాగారు. స్ట్రెయిట్ గా సాగే కథను ‘నాన్-లీనియర్’లో ఏదో ఒక్క సన్నివేశంలోనైనా ఫ్లాష్ బ్యాక్ పెట్టి చూపించే ప్రయత్నం చేసేవారు ప్రకాశరావు. ప్రేక్షకుడిలో ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తించేందుకు ఈ విధానం బాగా పనిచేస్తుందని ప్రకాశరావు విశ్వసించేవారు. తాను తెరకెక్కించిన సాంఘిక చిత్రాలలోనే కాదు, పౌరాణిక గాథల్లోనూ ఈ పద్ధతినే అనుసరించేవారాయన.
కె.యస్. ప్రకాశరావు పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం ‘ప్రేమనగర్’. ఇందులో కథానాయకుడు కళ్యాణ్ కు కన్నతల్లి అంటేనే పెద్దగా అభిమానం ఉండదు. కథ ఆరంభం నుంచీ ప్రేక్షకుడిలో అతనెందుకు తల్లితో అలా ఉన్నాడు అనే ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కన్నతల్లి కంటే తనను పెంచిన తల్లి ఎంతో ప్రేమగా చూసుకొనేదని హీరో ఓ సారి తన గతాన్ని చెప్పడం ద్వారా చూసేవారికి అసలు విషయం బోధ పడేలా చేశారు. ఇక యన్టీఆర్ తో కె.యస్. ప్రకాశరావు తెరకెక్కించిన ‘విచిత్ర కుటుంబం’లో కీలకమైన సన్నివేశాన్ని స్క్రీన్ ప్లేలోనే చూపించారు. కన్నకొడుకులా తన మరిదిని చూసుకొనే వదిన కోర్టులో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి, మరిది జైలుకు వెళ్ళేలా చేస్తుంది. అలా ఎందుకు చేసింది అన్నది చూసేవారికి ఆసక్తి కలిగిస్తుంది. విలన్ తన మరిదిని చంపకుండా ఉండడానికి, నెల రోజుల పాటు అతను జైలులో ఉంటే అక్కడ సురక్షితంగా ఉంటాడని ఆ వదిన భావించి ఉంటుంది. అందుకు కారణం, విలన్ తన మనిషితో గతంలో ఓ హత్య చేయించి ఉంటాడు. దానిని ఈ వదిన కళ్ళారా చూసి ఉంటుంది. అందువల్లే తన మరిదికి అలా కాకూడదనే ఆమె కోర్టులో అబద్ధం చెప్పి, మరిదికి శిక్ష పడేలా చేసి ఉంటుంది. లీనియర్ ఫార్మాట్ లో సాగినా, జనానికి అర్థమయ్యేలా ఉన్న ఈ కథలను కె.యస్.ప్రకాశరావు తనదైన పంథాలో నాన్ లీనియర్ గా రూపొందించి ఆకట్టుకున్నారు.
Also Read
- Varanasi : సూపర్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. వారణాసి 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
- Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
- Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
- Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
ప్రకాశరావు స్క్రీన్ ప్లేస్ అన్నిటిలోకి బెస్ట్ ఏది అంటే ఆయన రూపొందించిన ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ అని చాలామంది చెబుతారు. అందులో కథను ఫ్లాష్ బ్యాక్స్ లో చెప్పిన తీరు భలేగా ఆకట్టుకుంది. ఈ రోజుల్లో అందరూ అలాగే సాగుతున్నారు. 1971లోనే కె.యస్. ప్రకాశరావు ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ని ఆ తీరున తెరకెక్కించి ఆకట్టుకున్నారు. శోభన్ బాబు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. శోభన్ కు స్టార్ డమ్ తెచ్చిన తొలి చిత్రంగా నిలచింది. ఇవే కాదు ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందిన “నా తమ్ముడు, ఇదా లోకం, చీకటివెలుగులు” చిత్రాల్లోనూ ఆయన తనదైన బాణీ పలికించారు. ఇలా స్క్రీన్ ప్లేతో జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు కె.యస్.ప్రకాశరావు. పాటల్లో కూడా ఆయన తనదైన శైలిని చూపించారు. దానినే ఆయన తనయుడు కె.రాఘవేంద్రరావు పట్టేసి, తన చిత్రాలలో పాటలను తెరకెక్కించడంలో భళా అనిపించుకున్నారని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Varanasi : సూపర్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. వారణాసి ‘రుద్ర’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
-
Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!