Jyothi Rai No More Secrets Web Series First Look with Liplock Goes Viral: తెలుగు సీరియల్ ‘గుప్పెడంత మనసు’లో జగతిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి జ్యోతి రాయ్. ఇక ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతోనూ సత్తా చాటే పనిలో ఉన్న ఈ ముదురు భామ షేర్ చేసిన ఓ రొమాంటిక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె ‘నో మోర్ సీక్రెట్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో జ్యోతి రాయ్ కృనాల్ కపూర్ తో జంటగా కలిసి నటిస్తోంది. విజయ్ కుడికుల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సిరీస్‌ను పార్థిరెడ్డి, జీవన్ రెడ్డి, సంఘమిత్ర కలిసి నిర్మిస్తున్నారు. ముందు హిందీ ఇంగ్లీష్ లో రిలీజ్ చేయాలని అనుకున్నా ఇప్పుడు తెలుగులో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ దెబ్బకు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను జ్యోతి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేయగా అందులో బీచ్ లో కుర్రాడితో లిప్ లాక్ చేస్తూ ఆమె కనిపించింది.
Jabardasth Satya : భయపడుతూనే ఆ పాట చేశాను..
ఈ పోస్టర్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం ఆమె మరికొన్ని వెబ్ సిరీస్ లలో నటించబోతోంది అంటున్నారు. ఇక నటనలో బిజీగా ఉన్నా ఈ భామ సోషల్ మీడియాలో అందాల విందులో ఎక్కడా తగ్గడం లేదు.ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్లు. 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా ఓ బాబు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకోవడంతో కొంతకాలం ఒంటరిగానే ఉన్నా ఈ మధ్య యువ దర్శకుడు సుకు పుర్వాజ్ తో ప్రేమలో పడింది. అతడిని పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతున్నా అధికారికంగా ప్రకటించలేదు. సుకు కన్నడ సినిమా పరిశ్రమలో పలు హిట్ సినిమాలను తెరకెక్కించగా తెలుగులోనూ ‘మాస్టర్ పీస్’ అనే సినిమా డైరెక్ట్ చేశారు.