God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని కాంబినేషన్ల గురించి వినడమే ఒక వైబ్ ఇక వాటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే వచ్చే కిక్కే వేరు. తాజాగా టాలీవుడ్లో అలాంటి ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోయే భారీ మైథలాజికల్ సినిమా ‘గాడ్ ఆఫ్ వార్’ ఈ రోజు అఫీషియల్ గా ప్రకటించనున్నారనే వార్త బయటకు రాగానే సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంయుక్తంగా ఈ అల్టిమేట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఎన్టీఆర్ పవర్ఫుల్ యాక్టింగ్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు దిగ్గజాలు జతకడుతుండటం, దానికి తోడు ‘దేవర’ ఆల్బమ్‌తో తెలుగు ప్రేక్షకులను ఊపేసిన అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు మ్యూజిక్ తోడవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో ‘గాడ్ ఆఫ్ వార్’ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబో అనౌన్స్మెంట్ రాబోతుందని తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతూ ట్రెండింగ్ నిలిచింది. భారీ మైథలాజికల్ గా రాబోతుంది గాడ్ ఆఫ్ వార్ కు సంబంధించి మరికొన్ని గంటల్లో అధికారక ప్రకటన రాబోతోంది. ఏదేమైనా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ పాన్ ఇండియా వైడ్ గా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- NTR - Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
- Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న 'ఇడుపు కాయితం'.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
తాజావార్తలు
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!