JR NTR : దివంగత నందమూరి హరికృష్ణ 69వ జయంతి నేడు. ఈ సందర్భంగా చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను తలచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు చేశాడు. ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు, మొక్కవోని ధైర్యంతో సాగుతున్న మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు, ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే అంటూ రాసుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేర్లు ఉన్నాయి.
Read Also : Pawan Kalyan : తండ్రి సమానులు.. మార్గదర్శి.. చిరుపై పవన్ అభిమానం
హరికృష్ణ 2018లో యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి ఏటా హరికృష్ణ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ షూటింగ్ లోనే బిజీగా ఉంటున్నాడు. ఆ మూవీపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా వచ్చిన వార్-2 ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ మూవీ తర్వాత మల్టీస్టారర్ సినిమాలో నటించకూడదని జూనియర్ ఎన్టీఆర్ నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. డ్రాగన్ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఎన్టీఆర్.
Read Also : OG : ఓజీ నుంచి స్పెషల్ పోస్టర్.. పవన్ స్టైలిష్ లుక్
