Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్… పెంపుడు కుక్క బఘీరాకు కన్నీటి వీడ్కోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR: వెండితెరపై ఎంత మాస్‌గా కనిపించినా, పర్సనల్ లైఫ్ లో ఎంతో సున్నితమైన మనసున్న వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ మరోసారి అభిమానులను కదిలించారు. గత నాలుగేళ్లుగా తనతో పాటు అడుగడుగునా ఉన్న పెంపుడు కుక్క ‘బఘీరా’ మరణంతో తారక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఒక స్నేహితుడిగా వచ్చి, తెలియకుండానే కుటుంబ సభ్యుడిగా మారిపోయిన బఘీరాకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయాన్ని తాకేలా వీడ్కోలు పలికారు. తారక్ రాసిన ఒక్కో మాట ఇప్పుడు అభిమానులను కూడా ఎమోషనల్ చేస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బఘీరాతో కలిసి గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ పలు ఫొటోలు పంచుకున్నారు. వాటితో పాటు రాసిన భావోద్వేగ సందేశంలో బఘీరా తన జీవితంలో ఎంత ప్రత్యేక స్థానం సంపాదించిందో వివరించారు. నువ్వు నా జీవితంలోకి ఒక స్నేహితుడిగా వచ్చావు, కానీ మెల్లగా నా కుటుంబంలో భాగమైపోయావు అంటూ ఆయన రాసిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
బఘీరా తన జీవితంలోని ప్రతి రోజును ప్రేమతో, విశ్వాసంతో నింపేసిందని తారక్ పేర్కొన్నారు. తనను ఎంచుకుని నాలుగేళ్ల పాటు తనతో పాటు నడిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇక స్వేచ్ఛగా పరిగెత్తు నా చిన్నారీ, నిన్ను చాలా ప్రేమించాను, ఇంకా ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ బఘీరాకు చివరి వీడ్కోలు చెప్పారు.
తారక్‌కు పెంపుడు జంతువులపై ఉన్న ప్రేమ కొత్త విషయం కాదు. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో కూడా ఈ విషయం బయటపడింది. ఆ షోలో అతిథిగా పాల్గొన్న రామ్ చరణ్, తన పెంపుడు కుక్కను కోల్పోయిన తర్వాత తారక్ ఎంతగా బాధపడ్డారో గుర్తు చేశారు. పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే వ్యక్తి తారక్ అని ఆ సందర్భంలో చరణ్ చెప్పిన మాటలు అభిమానులకు ఇప్పటికీ గుర్తున్నాయి.
బఘీరా మరణంతో తారక్ మరోసారి అలాంటి బాధనే ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్ల పాటు తన జీవితంలో భాగమైన ఓ మూగజీవిని కోల్పోవడంతో ఆయన ఎంతగా బాధపడుతున్నారో ఆయన చేసిన పోస్ట్ స్పష్టంగా తెలియజేస్తోంది.
తారక్ పోస్ట్ బయటకు వచ్చిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో బఘీరాకు నివాళులు అర్పిస్తూ, తారక్‌కు ధైర్యం చెప్పే సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఒక పెంపుడు జంతువుతో ఏర్పడే బంధం ఎంత గాఢంగా ఉంటుందో, ఆ బంధం కోల్పోయినప్పుడు కలిగే వెలితి ఎంత బాధాకరమో తారక్ హృదయపూర్వకంగా రాసిన ఈ వీడ్కోలు మరోసారి అందరికీ గుర్తు చేసింది.
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!