God of War: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై రాజకీయ దుమారం.. తమిళనాడులో విడుదల అడ్డుకుంటామంటూ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
God of War: జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’. షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ చిత్రం ఇప్పుడు రాజకీయ వివాదాల్లో చిక్కుకోవడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా హిందూ దేవుడు కార్తికేయుడు, తమిళ సంప్రదాయంలో మురుగన్‌గా ఆరాధించబడే దేవుడి జన్మస్థలానికి సంబంధించిన చిత్రబృందం చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీశాయి. గత వారం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, కథకు సంబంధించిన కాన్సెప్ట్‌ను వివరిస్తూ మురుగన్ ఉత్తర ప్రాంతంలో జన్మించి, అనంతరం దక్షిణాదితో ముడిపడిన దేవుడిగా మారినట్లు పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి. తమిళనాడులో మురుగన్‌ను ‘తమిళ కడవుల్’గా భావించే సంప్రదాయం బలంగా ఉండటంతో, ఈ వ్యాఖ్యలు చారిత్రక, సాంస్కృతిక వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై తమిళనాడు రాజకీయ నాయకుడు, నటుడు సీమాన్ ఘాటుగా స్పందించారు. మురుగన్‌ను తమిళుల ఆరాధ్య దైవంగా భావించే సంప్రదాయాన్ని విస్మరించి, ఆయనను ఉత్తర భారతానికి చెందిన దేవుడిగా చూపించే ప్రయత్నం చేయడం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. కళ పేరుతో చరిత్రను మార్చే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు. చిత్రబృందం చేసిన అధికారిక పోస్టే ఈ వివాదానికి కారణమైందని, అది తమిళుల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు, ఈ సినిమా తమిళనాడులో విడుదల కాకుండా తమ పార్టీ పోరాడుతుందని కూడా సీమాన్ ప్రకటించారు. అవసరమైతే తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్ర ప్రదర్శనను అడ్డుకునేందుకు ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. దీంతో సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, అప్పుడే రాజకీయ వేడి మొదలైనట్లుగా కనిపిస్తోంది.
Also Read
- B - Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
- IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ 'బ్లాక్ బస్టర్'
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
అయితే ఇప్పటివరకు ఈ వివాదంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు. కథకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించలేదు. సినిమా నిర్మాణ దశలోనే ఉండటంతో భవిష్యత్తులో చిత్రబృందం ఈ అంశంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఒకవైపు చిత్రబృందానికి మద్దతుగా నిలుస్తున్నవారు కళాత్మక స్వేచ్ఛను ప్రస్తావిస్తుండగా, మరోవైపు చారిత్రక, సాంస్కృతిక అంశాల్లో జాగ్రత్త అవసరమని మరో వర్గం అభిప్రాయపడుతోంది. ఏది ఏమైనా, విడుదలకు చాలా ముందే ‘గాడ్ ఆఫ్ వార్’ చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై చిత్రబృందం ఎలా స్పందిస్తుంది? తమిళనాడులో నెలకొన్న అభ్యంతరాలకు ఎలాంటి వివరణ ఇస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- Tags
- cinema
- God Of war
తాజావార్తలు
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
-
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!