Johnny Depp: హాలీవుడ్ నటుడు జానీ డెప్ మరోసారి వార్తలో ఎక్కాడు. మొన్నటివరకు భార్య అంబర్ హెరాల్డ్ తో కోర్టులో పోరాడిన జానీ ఎట్టకేలకు గెలిచి బయటకు వచ్చాడు. ఇక ఇక్కడితో సమస్య తీరిపోయిందిలే అనుకున్న జానీకు మాజీ ప్రేయసి రూపంలో మరో సమస్య మొదలయ్యింది. జానీ డెప్ మాజీ ప్రేయసి ఎలెన్ బార్కిన్ అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. అంబర్ హెరాల్డ్ వేసిన పరువు నష్టం దావా కేసులో సాక్షిగా ఉన్న ఆమె, జానీ ఇలాంటివాడు అంటూ కోర్టు డాక్యుమెంట్స్ లో పేర్కొంది. అతడు డ్రగ్స్ తీసుకోవడం తాను కళ్లారా చూశానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా జానీ తానకు డ్రగ్స్ ఇచ్చి శృంగారంలో పాల్గొనేలా చేసాడని ఆరోపించింది.
“జానీ పచ్చి తాగుబోతు.. ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. మేము చాలా రోజులు కలిసే ఉన్నాం. వారం రోజుల్లో రెండు రోజులు మా ఇంటి దగ్గర, మరో రెండు రోజులు వారి ఇంటిదగ్గర కలిసేవాళ్ళం. మొట్టమొదటిసారి మేము కలిసిన రోజున కూడా అతడు తాగే వచ్చాడు. నాకు ఒక డ్రగ్ ఇచ్చాడు. ఆ మత్తులో అతడు నన్ను ఎన్నో మాటలు అన్నాడు. బూతులు తిట్టాడు. అనంతరం నాతో శృంగారం చేశాడు. ఇక తరువాత తానెప్పుడు నన్ను ఒక బానిసలా ఉండాలనుకొనేవాడు. అనుమానించేవాడు. ఎవరితోనైనా కనిపించినా.. ఎక్కడికి వెళ్లారు..? రాత్రంతా ఏం చేశారు..? అంటూ ప్రశ్నలతో వేధించేవాడు. ఒకసారి నా వీపుపై గాయమయితే.. ఎవరితో పడుకున్నావు అంటూ అసభ్యంగా తిట్టిపోశాడు. అతడికి లేని అలవాటు లేదు.. ఒకసారి తాగిన మత్తులో నాపై బాటిల్ ను విసిరాడు” అంటూ ఆరోపించింది. ప్రస్తుతం ఎలెన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై జానీ డెప్ ఎలా స్పందిస్తాడో చూడాలి.