Attack 2: హృతిక్, టైగర్ పై జాన్ ‘ఎటాక్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పట్టువదలని విక్రమార్కులు ఎక్కడైనా కొందరుంటారు. పరాజయం పలకరించినా, అదరక బెదరక ప్రయత్నం మాత్రం వీడరు. నటుడు, నిర్మాత, కథకుడు అయిన జాన్ అబ్రహామ్ ను ఆ కోవలోని వాడే అని భావించవచ్చు. ఏప్రిల్ 1న జాన్ హీరోగా నటించి, కథ అందించిన ‘ఎటాక్ పార్ట్ 1’ మూవీ జనం ముందు నిలచింది. ఏ మాత్రం జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. ఓ మాటలో చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో ముందుగానే భావించినట్టు ‘ఎటాక్ పార్ట్ 2’ను తీసే యోచనలోనే ఉన్నారు నిర్మాతలు, దర్శకుడు. వారికి కథకునిగా, నటునిగా జాన్ అబ్రహామ్ ప్రోత్సాహమిస్తున్నాడు. రాబోయే ‘ఎటాక్’ రెండో భాగాన్ని భారీగా నిర్మించి, జనం ముందు నిలిపితే ఆకట్టుకుంటుందని జాన్ అంటున్నారు. అందులో భాగంగా ‘ఎటాక్-2’లో యాక్షన్ హీరోస్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటిస్తే మరింత మేలనీ జాన్ భావిస్తున్నాడు.
గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటించిన ‘వార్’ చిత్రంలో నటించారు. ఆ సినిమా కథ, కథనం ఎలా ఉన్నా, వారిద్దరి కోసం జనం ఆ మూవీని విజయపథంలో నడిపించారు. ముఖ్యంగా వారిద్దరూ ‘వార్’లో చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ జనాన్ని కట్టిపడేశాయని విమర్శకులు సైతం అంగీకరించారు. అందువల్ల హృతిక్, టైగర్ తమ ‘ఎటాక్ పార్ట్ 2’లో నటిస్తే ఆ సినిమాకే వన్నె వస్తుందని జాన్ ఆశిస్తున్నాడు. నిర్మాతల్లో ఒకరైన జయంతీలాల్ గడా కూడా అందుకు సుముఖంగా ఉన్నారని జాన్ అంటున్నాడు. మరి హృతిక్, టైగర్ ఏమంటారో చూడాలి!
Also Read
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
- Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
- Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
తాజావార్తలు
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!