Jewel Thief : కృష్ణ డై హార్డ్ ఫ్యాన్ కృష్ణసాయి హీరోగా ‘జ్యువెల్ థీఫ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్ కృష్ణసాయి హీరోగా ‘జ్యువెల్ థీఫ్’ అనే సినిమా రూపొందింది. Beware of Burglar అనేది సబ్ టైటిల్. మీనాక్షి జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించిన ఈ సినిమాలో విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ , ట్రైలర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సినిమాను నవంబర్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఈ సినిమాలో సీనియర్ నటీనటులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ క్రమంలో హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని. ఆయన ఇన్సిపిరేషన్ తో చిత్ర సీమలోకి అడుగుపెట్టాను. ‘జ్యువెల్ థీఫ్’ అనే మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని అన్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. మరో వైపు సెన్సార్ బోర్డు ప్రశంసలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ‘జ్యువెల్ థీఫ్’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. నవంబర్ 8 న విడుదల కాబోతున్న మా సినిమా ఈ తరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఒకప్పటి హీరోయిన్ ప్రేమ గారితో కలిసి ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది.” అన్నారు.
Also Read
- The Paradise: 20 కోట్ల వ్యూస్‌తో దుమ్మురేపిన 'ఆయా షేర్'.. 'ది ప్యారడైజ్' రిలీజ్ డేట్‌పై బిగ్ అప్డేట్!
- Ram Charan: రామ్ చరణ్‌కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
- Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
- Srinivasa Mangapuram: జూలై 30న హిట్ కొడుతున్నాం.. కాన్ఫిడెంట్‌గా 'శ్రీనివాస మంగాపురం' టీమ్.. జయకృష్ణ నటనపై ప్రశంసలు
తాజావార్తలు
-
Mojtaba Khamenei: హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు.. “జిహాద్, ప్రతిఘటనే ఏకైక మార్గం”.. మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు
-
The Paradise: 20 కోట్ల వ్యూస్‌తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌పై బిగ్ అప్డేట్!
-
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. ట్రోఫీతో పాటు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ
-
Ram Charan: రామ్ చరణ్‌కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!