Jennifer Lawrence:ముద్దమందారం లాంటి ముద్దుగుమ్మ జెన్నీఫర్ లారెన్స్. కేవలం 22 ఏళ్ళ వయసులోనే ఉత్తమనటిగా ‘సిల్వర్ లైనింగ్ ప్లే బ్యాక్స్’ సినిమాతో ఆస్కార్ సొంతం చేసుకుంది. నటుడు నికోలస్ హౌల్ట్ తోనూ, ఫిల్మ్ మేకర్ డారెన్ అరనోఫ్స్కీ తోనూ సహజీవనం చేసింది. వారిద్దరితోనూ బ్రేకప్ చెప్పేసింది. తన జీవితంలో అందరికంటే మరపురాని మగాడు ఎవరైనా ఉన్నారంటే అది తన సహనటుడు బ్రాడ్లే కూపర్ అంటోంది. కూపర్ లాంటి నటుడు తనకు లభించడం ఎంతో అదృష్టమనీ చెబుతోంది. కూపర్ తో జెన్నీఫర్ నటించిన “సెరెనా, సిల్వర్ లైనింగ్స్ ప్లే బుక్, అమెరికన్ హజిల్” వంటి చిత్రాలు నటిగా ఆమెకు ఎంతో పేరు సంపాదించి పెట్టాయి. ఈ చిత్రాలలో నటిస్తున్నప్పుడే కూపర్ తో జెన్నీఫర్ కు ఎంతో అనుబంధం ఏర్పడింది. అతనిలాంటి నమ్మదగ్గ నటుడిని ఇంతవరకూ చూడలేదని జెన్నీఫర్ చెబుతోంది.
కూపర్ తో శృంగార సన్నివేశాల్లో నటించడం ఎంతో సరదాగా ఉంటుందని అంటోంది జెన్నీఫర్. నిజానికి ఇంటిమసీ సీన్స్ లో నటించగానే, కొందరు నటులు వెంటనే చొరవతీసుకొని తమ గదికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారనీ గుర్తు చేసుకుంది జెన్నీఫర్. కానీ, కూపర్ మాత్రం తన వృత్తికి తగినట్టుగా నటించడం తప్ప మరేమీ కోరుకోడనీ అంటోంది. అందువల్ల కూపర్ తో ఇంటిమసీ సీన్స్ లో నటించడం తనకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించదనీ వివరించింది. కూపర్ ను ‘వెట్ కిస్సర్’గా జెన్నీఫర్ అభివర్ణించింది. మరి అంతలా ఎక్కడెక్కడ ముద్దులు పెట్టాడో? నటనలో అనకు అసలైన భాగస్వామి కూపర్ అనీ కితాబు నిస్తోంది. అంతలా పొగిడేసి తమ మధ్య కేవలం వృత్తిపరమైన అనుబంధం మాత్రమే ఉందని జెన్నీఫర్ చెప్పడం విన్నవారికి నిరాశ కలిగించింది.