Who Movie Trailer Launched: ఇటీవల దయ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న జెడీ చక్రవర్తి హీరోగా శుభ రక్ష, నిత్య హీరోయిన్స్ గా తెరకెక్కిన తాజా చిత్రం ‘హూ’. ఇటీవల ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్ ప్రసన్న కుమార్, ఆర్టిస్ట్ నాగ మహేష్ లు సంయుక్తంగా ఆవిష్కరించగా , పోస్టర్ ను ప్రముఖ నిర్మాత ఆచంట గోపీనాథ్, నిర్మాత శోభారాణి , ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ కొల్లి రామ కృష్ణ రివీల్ చేశారు. అంతేకాక ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఈశ్వర్, బలగం ఫేం సంజయ్, వంటి వారు పాల్గొన్నారు.
Em chestunnav: శ్రీ విష్ణు చేతుల మీదుగా ‘ఏం చేస్తున్నావ్’ ట్రైలర్ లాంచ్
ఈ సినిమాలో హీరోగా నటించడమే కాదు జెడి చక్రవర్తి స్వీయ దర్శకత్వం కూడా వహించారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న ‘హూ’ ఒక ఎమోషనల్ థ్రిల్లర్ అని సినిమాలో జెడి చక్రవర్తి నటన చాలా వైవిధ్యంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు వెల్లడించారు. జెడి చక్రవర్తి, శుభ, నిత్య, వినయ్ ప్రసాద్, విజయ్ చందర్, సునీల్ పూర్ణిక్, రమేష్ పండిట్, హర్షిత, ఉగ్రం రవి, శరణ్య, సనత్, నాగేంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకి ఈశ్వర్ చంద్ సంగీతం అందించగా జెడి చక్రవర్తి ఎడిటింగ్ కూడా చేశారు. ఇక రెడ్డమ్మ కే బాలాజీ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకోనుంది అనేది చూడాలి.