Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) తన వ్యక్తిగత జీవితంపై సంచలన ఆరోపణలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తన 14 ఏళ్ల వైవాహిక జీవితం ఓ నరకమని, ఇన్నాళ్లూ ఒక బానిసలా బతికానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన పిల్లల భవిష్యత్తు కోసమే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇకపై తనను ఎవరూ రెచ్చగొట్టవద్దని రవి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తనపై కొందరు కావాలనే కుట్రలు పన్నారని, ఏకంగా తన మీద క్షుద్ర పూజలు సైతం చేయించారని జయం రవి బాంబు పేల్చారు. ఆ పూజల ప్రభావంతో తాను రక్తపు వాంతులు కూడా చేసుకున్నానని కన్నీరు పెట్టుకున్నారు. ఒక గ్రూప్ క్రియేట్ చేసి, వాళ్లకు డబ్బులు ఇచ్చి మరీ తనను రోడ్డు మీదకు లాగే ప్రయత్నం చేస్తున్నారని, ఆ కుట్రలన్నీ తనకు తెలుసునని ఆయన స్పష్టం చేశారు.
ఓ ‘మూడక్షరాల ఇడ్లీ నటి’ వల్లే తన జీవితం పూర్తిగా నాశనమైందని జయం రవి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివాదాస్పద నటి ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో కుటుంబాలను కూల్చేసిందని ఆయన మండిపడ్డారు. మరోవైపు, తన కష్టకాలంలో అండగా నిలిచిన కెనీషాను కూడా కావాలనే టార్గెట్ చేసి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. “సినిమాల్లో మహిళల హక్కుల గురించి మాట్లాడే నేను, నిజజీవితంలోనూ వాళ్లను ఎప్పుడూ తప్పు పట్టలేదు. అయినా, 45 ఏళ్ల వయసులో నేను అమ్మాయిల వెంట పడాల్సిన అవసరం నాకు లేదు” అని రవి కుండబద్దలు కొట్టారు. కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినా, తన భార్య ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు తన చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేశారని ఆయన వాపోయారు. ఆస్తులన్నీ భార్య వైపు వాళ్లే ఉంచుకున్నారని, కనీసం తన సొంత డబ్బును తనకు ఇష్టమైనట్లు ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరు మీద ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా చేసి, రోడ్డున పడేశారని.. కోట్లు సంపాదించిన తాను ప్రస్తుతం అద్దె ఇంట్లో బతుకుతున్నానని తన దీనస్థితిని వివరించారు.
Also Read
తనకు ప్రాణమైన పిల్లల్ని కూడా చూడనివ్వకుండా అడ్డుకుంటున్నారని జయం రవి కన్నీరు పెట్టుకున్నారు. పిల్లల ఫోన్లు లాక్కున్నారని, స్కూల్‌కి కూడా వాళ్ళను బాడీగార్డ్స్ మధ్య పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు. “నా పిల్లలు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి, నా బాధ వారికి అర్థం కావాలి” అని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. వ్యక్తిగత జీవితంలోని ఈ కల్లోలం పూర్తిగా సద్దుమణిగి, కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాను సినిమాల్లో నటించనని జయం రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు చక్కబడ్డాకే తిరిగి కెమెరా ముందుకు వస్తానని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!