Jayalalitha: నటి జయలలిత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా అప్పట్లో జయలలిత వ్యాంప్ క్యారెక్టర్స్ తో బాగా పేరు తెచ్చుకుంది. ఇక రీ ఎంట్రీలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ నటిగా కొనసాగుతుంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క సీరియల్స్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవితంలో జరిగిన విషయాలను నెమరువేసుకుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె.. శరత్ బాబుతో ఉన్న రిలేషన్ గురించి, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటపెట్టింది.
” ఇండస్ట్రీలో నన్ను నేను రక్షించుకోవడానికి ఎలాంటి ప్లాన్ లు వేయలేదు. అందరితో కలివిడిగానే ఉండేదాన్ని. కొన్నిసార్లు తప్పించుకొనేదాన్ని.. కొన్నిసార్లు లొంగిపోవాల్సివచ్చింది. కెరీర్ లో చాలామంది మగాళ్లకు లొంగిపోయాను. అలా అని అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని చెప్పలేను. అడిగేవారు.. ప్రేమ, పెళ్లి లాంటివి ఏమి లేదు. అవసరం అంతే. అందంగా ఉండేదాన్ని, వ్యాంప్ క్యారెక్టర్స్ చేసేదాన్ని.. వచ్చేవాళ్ళు, అడిగేవాళ్ళు.. తప్పించుకోవాలని ట్రై చేసేదాన్ని .. కుదరకపోతే లొంగిపోయేదాన్ని. ఇక ఆ సమయంలో కొట్టడం, హింసించడం, వారి కోపాన్ని నాపై చూపించడం.. అలాంటివేమీ చేసేవారు కాదు. పని అయ్యిందా.. ? అంతే. పొద్దునే ఎప్పటిలానే ఉండేవారు. ఇక ఇండస్ట్రీలో తలుపులు కొట్టడం, అడగడం ఉండేవే. ఒక ఆర్టిస్ట్.. ఒకరోజు నైట్ తలుపుకొట్టి.. తలుపు తీయకపోతే ఉరి వేసుకుంటా అని బెదిరించాడు. నేనెప్పుడు అలాంటివాటికి భయపడలేదు. ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించేదాన్ని. అలా తప్పించుకుంటే.. ఒక డైరెక్టర్ సగం షూటింగ్ చేసాక వెళ్ళిపోమన్నాడు.
ఇక ఒకసారి పెళ్లి చెడిపోయాకా.. ఇంకెవరితోనూ ఉండాలని అనుకోలేదు. ప్రేమ, పెళ్లి, పిల్లలు .. ఇలా ఏమి ఆలోచించలేదు. చాలామంది చెప్పారు.. ఒక వయస్సుకు వచ్చాకా తోడు కావాలి కదా ..పెళ్లి కాకపోతే కనీసం ఒక పిల్లను అయినా పెంచుకో అని సలహా ఇచ్చారు. నాకేది వద్దని చెప్పాను. నేను ఎలా అయినా పోనీ.. నా కుటుంబం బావుండాలని అనుకున్నాను. ఇప్పుడు అంతా సెటిల్ అయ్యారు. ఇక శరత్ బాబుతో నాకు మంచి సంబంధం ఉంది. అది మనసుకు దగ్గరైన సంబంధం. రమాప్రభను నేను అక్క అని పిలుస్తా.. శరత్ బాబును బావ అంటా. ఆయన నాకు గైడ్ లా. ఎంతో మంచి వ్యక్తి. ఆయనతో మాట్లాడితే టైమ్ తెలియదు. శరత్ బాబు యాత్రలకు బాగా వెళ్లేవారు. ఇక ఆడదానిగా కాకుండా యాత్రలకు నన్ను కూడా తీసుకెళ్లమని అడిగాను. అలా ఎన్నో యాత్రలకు వెళ్ళాం. మా ఇద్దరి మధ్య ఒక విడదీయలేని అనుబంధంగా మారింది. ఒకానొక సమయంలో శరత్ బాబుతో బిడ్డను కనాలని ప్రయత్నించాము. ఆయన ఎంతో ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి. ఎన్నోరోజులు అలోచించి.. వద్దు లలిత.. నేను , నువ్వు లేకపోతే ఆ బిడ్డ అనాధగా మారుతుంది అని చెప్పారు. ఇక దాన్ని కూడా విరమించుకున్నా.. ఆయన లేరు కాబట్టి ఈ విషయం చెప్పాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నాకు అనవసరం. రమాప్రభతో ఆయనకు ఉన్నవిబేధాలు ఏంటి అనేది నాకు తెలియదు. నాతో ఎలా ఉన్నారు అనేది నేను చూసాను. చనిపోయే చివరితోజు వరకు హాస్పిటల్ కు వెళ్లి నేను చూస్ వచ్చేదాన్ని.. బావ, బావ అని పిలిచే మనిషిని చనిపోయినప్పుడు చూడలేకపోయాను” అని చెప్పుకొచ్చింది.