Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో ‘పెద్ది’ ఒకటి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన గ్రాండ్ విజువల్స్‌తో, పవర్ఫుల్ ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూన్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుండగా, దానికి ఒకరోజు ముందుగానే అంటే జూన్ 3న ఓవర్సీస్, పలు ప్రాంతాల్లో భారీగా ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్, హీరోయిన్ జాన్వీ కపూర్ డబ్బింగ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.
సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు మేకర్స్ ఒక భారీ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ నెల 18 నుంచి చిత్ర యూనిట్ ‘పవర్‌ప్లే టూర్’ పేరిట గ్రాండ్ ప్రమోషన్లను ప్రారంభించనుంది. ఇందులో భాగంగానే బాలీవుడ్ మార్కెట్‌ను కూడా టార్గెట్ చేస్తూ ముంబైలో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల సమక్షంలో ఈ వేదికపైనే ‘పెద్ది’ అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆమె తన క్యారెక్టర్‌కు స్వయంగా తెలుగులోనే డబ్బింగ్ చెప్తోంది. జాన్వీ కెరీర్లో తెలుగులో సొంత వాయిస్ ఇస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమా కథ ఉత్తరాంధ్ర (వైజాగ్/శ్రీకాకుళం) బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. అక్కడి లోకల్ యాసను (స్లాంగ్) పక్కాగా పలకడం చాలా కష్టమైనప్పటికీ, పాత్రలో సహజత్వం లోపించకూడదనే ఉద్దేశంతో జాన్వీ ఈ సవాలును స్వీకరించి డబ్బింగ్ పూర్తి చేస్తోంది.
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!