Rajnikanth : జైలర్ హిట్టయినా..జైలర్2ను తెలుగులో ఎందుకు కొనడం లేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘జైలర్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ ‘జైలర్ 2‘ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ధర ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మేకర్స్ ఈ సినిమా కోసం ఏకంగా 60 కోట్ల రూపాయలు కోట్ చేస్తున్నట్లు సమాచారం. జైలర్ బ్లాక్ బస్టర్ కావండతో ఆ రేంజ్ లో కోట్ చేస్తున్నారు మేకర్స్.
కానీ రజనీకాంత్ గత సినిమాల మార్కెట్ గ్రాఫ్ ఒకసారి పరిశీలిస్తే రూ. 60 కోట్లు చాలా ఎక్కవనే టాక్ వినిపిస్తోంది. ‘రోబో’ తర్వాత దాదాపు 13 ఏళ్లకు ‘జైలర్’ మళ్ళీ ఆ స్థాయి హిట్‌ను ఇచ్చింది. ఈ సినిమా తెలుగు రైట్స్ కేవలం 12 కోట్ల రూపాయలకే అమ్ముడయ్యాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద రూ. 55 కోట్ల రూపాయల భారీ వసూళ్లను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో తెలుగు రైట్స్ రికార్డు స్థాయిలో రూ. 45 కోట్లకు అమ్ముడయ్యాయి. అయితే కలెక్షన్లు మాత్రం రూ. 44 కోట్లకు పరిమితమవ్వడంతో బయ్యర్లు స్వల్ప నష్టాలను చూడాల్సి వచ్చింది. రజనీ నటించిన వెట్టయాన్ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. రూ. 17 కోట్ల రైట్స్ ధరకు గాను కేవలం రూ. 11 కోట్లు మాత్రమే వసూలు చేసి దాదాపు 40% నష్టాలను మిగిల్చింది.
Also Read
- Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికేనా?
- Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో 'నాగబంధం'.. ట్రైలర్ చూశారా!
- Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
- The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
జైలర్ మొదటి భాగం తక్కువ ధరకు రావడంతో భారీ లాభాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ‘జైలర్ 2’ కోసం మేకర్స్ అడుగుతున్న రూ. 60 కోట్లు అనేది చాలా పెద్ద మొత్తం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదా.పు రూ. 120 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. రజనీకాంత్ క్రేజ్ మరియు నెల్సన్ మార్క్ టేకింగ్ పై నమ్మకం ఉన్నప్పటికీ బయ్యర్లు వెనకడుగు వేస్తున్నారు. ఒకవేళ ఈ ధరకు బయ్యర్లు ముందుకు రాకపోతే కమిషన్ ప్రాతిపదికన సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vivek Agarwal: FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్.. ప్రపంచ వేదికపై పెరిగిన భారత ప్రతిష్ఠ
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!