శివరాజ్ కుమార్ ‘జై భజరంగి’ టీజర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బాహుబలి’ సక్సెస్ తో దక్షిణాది చిత్రాలకు క్రేజ్ వచ్చింది. దాంతో కన్నడ భాషలో రూపుదిద్దుకున్న ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సౌత్‌లో చిన్న పరిశ్రమగా ఉన్న శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’. అదే స్థాయిలో కన్నడ సినీ పరిశ్రమ నుండి వస్తున్న మరో అత్యంత భారీ చిత్రం ‘జై భజరంగి’. కరుండా చక్రవర్తి డా. శివరాజ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషలలో లో ఒకేసారి విడుదలకు సిద్ధమౌతోంది.
డా. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ‘భజరంగి’ 2013 లో కర్ణాటక రాష్ట్రం లో 212 థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలం సృష్టించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా కన్నడలో ‘భజరంగి 2’ ను నిర్మించారు. ఈ సినిమాకు తెలుగులో ‘జై భజరంగి’ అనే పేరు ఖరారు చేశారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల వీడియో రైట్స్ ను పొందిన శ్రీ బాలాజీ వీడియో అధినేత నిరంజన్ పన్సారి ‘జై భజరంగి’ చిత్రాన్ని తెలుగు వారి ముందుకు త్వరలో తీసుకురాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సెప్టెంబర్ 11వ తేదీ రాత్రి విడుదల చేశారు.
Also Read
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
ఈ సందర్భంగా నిర్మాత నిరంజన్ పన్సారి మాట్లాడుతూ, “గత 35 ఏళ్లుగా వీడియో రంగం లో వున్నాం. ఇప్పటివరకు సుమారు 400 చిత్రాలకు పైగా వీడియో హక్కులను పొందాం. తెలుగులో ‘మగధీర’ సినిమాతో బ్లూ రే డిస్క్ ని మా సంస్థ ద్వారా పరిచయం చేశాం. అదే విధంగా మేము స్థాపించిన ‘శ్రీ బాలాజీ మూవీస్’ యు ట్యూబ్ ఛానల్ కూడా 1 కోటి 35 లక్షల వీక్షకులను కలిగి ఉంది. తాజాగా డా. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ‘జై భజరంగి’ చిత్రంతో టాలీవుడ్ నిర్మాణరంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. ‘భజరంగి 2’ షూటింగ్ 2019 లో మొదలైంది. ఈ రెండేళ్ళు కరోనా క్రైసెస్ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఎ. హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టెక్నికల్ గా ‘బాహుబలి, కె.జి.యఫ్’ లకు ఏ మాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!