స్టార్ హీరోయిన్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. భారీ దోపిడీలో ఇప్పటికే మనీలాండరింగ్ కేసు నమోదైన కన్మాన్ సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో ఈడీ ఆమెను సాక్షిగా విచారించింది. సుకేశ్ ఒక వ్యాపారవేత్త నుండి రూ.200 కోట్లు దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా సుకేశ్‌పై 20 ప్రత్యేక ఫిర్యాదులు నమోదయ్యాయి. కోట్లాది రూపాయల దోపిడీ రాకెట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్ వల్ల ఈ స్టార్ హీరోయిన్ పేరు కూడా బయటకు వచ్చింది.
Rea Also : రచయితగా మారిన తమన్నా… ‘బ్యాక్ టు ది రూట్స్’
అయితే ఈ కేసుతో జాక్వెలిన్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆమె గతంలో సుకేష్‌తో రిలేషన్ లో ఉంది. ఆ కారణంతోనే ఈడీ జాక్వెలిన్ ను ప్రశ్నించారు. రానున్న రోజుల్లో జాక్వెలిన్ ను మరోసారి ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పిలుస్తుంది.
ఇక ఆమె సినిమాల విషయానికొస్తే క్రిష్ దర్శకత్వం వహిస్తున్న “హరి హర వీర మల్లు”లో ఓ ప్రత్యేక పాత్రలో కన్పిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆమె ముస్లిం యువరాణిగా కనిపిస్తుంది.