నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ, తన ప్రత్యేక శైలి, నిజాయితీతో ఇంకా అభిమానుల గుండెల్లో రాజ్యమేలుతున్న బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్. తన కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తన స్టైలిష్ లుక్స్, సహజమైన నటనతో అభిమానుల మనసులో స్థానం సంపాదించిన జాకీ, ఇప్పటికీ కొత్త తరం హీరోలతో పోటీగా బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన హౌస్‌ఫుల్ 5, తన్వి ది గ్రేట్ వంటి సినిమాల్లో కనిపించగా, త్వరలో వెల్‌కమ్ టు ది జంగిల్లో నటిస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో ప్రతి నటుడికి తనదైన స్టైల్, తనదైన అలవాట్లు ఉంటాయి. కొందరు రిహార్సల్స్‌తోనే సీన్‌లోకి దిగుతారు, మరికొందరు ఎక్కువ జన సమక్షంలో నటించడానికి ఇబ్బంది పడతారు. అలాగే రొమాంటిక్ సన్నివేశాలు విషయానికి వస్తే కొంతమంది ప్రత్యేకమైన అలవాట్లు ఉంటాయి. అలాంటి ఒక విషయం బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ తాజాగా బయటపెట్టారు.
Also Read : Kantara-Chapter-1 : గ్లోబల్ రీచ్ కోసం సిద్ధమవుతున్న ‘కాంతార 1’.. వర్కౌట్ అవుతుందా?
జాకీ మాట్లాడుతూ.. “మాధురి దీక్షిత్, జూహీ చావ్లా వంటి సీనియర్ హీరోయిన్లతో రొమాంటిక్ సీన్స్, కిస్సింగ్ సీన్స్ చేయాల్సి వచ్చిందంటే నాకు చాలా టెన్షన్ వేసేది. ఆ సమయంలో ధైర్యం కోసం బ్రాందీ తాగి కెమెరా ముందు నిలబడేవాడిని. 1989లో విడుదలైన వర్ది సినిమాలో మాధురితో, 1993లో వచ్చిన, అయినా సినిమాలో జూహీ తో చేసిన రొమాంటిక్ సన్నివేశాలు నాకు నిజంగా చాలాసార్లు సిగ్గుపడేలా చేసేవి. ఫ్యాన్స్ నన్ను “సెక్సీ ష్రాఫ్” అని పిలిచినా, వాస్తవానికి కెమెరా ముందు ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ చేయడం చాలా కష్టంగా ఉండేదని జాకీ ఒప్పుకున్నారు. అలాగే మాధురి, జూహీ, డింపుల్ కపాడియా వంటి సహనటిమణులపై నాకూ చిన్నపాటి అభిమానం ఉండేది, కానీ అది ఎప్పుడు హద్దులు దాటలేదు’ అని తెలిపారు.