Jabardasth Satya Sri grandmother passed away: జబర్దస్త్ స్టేజ్ ఎంతో మందికి మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది, ఆ స్టేజ్ మీద చాలా మందికి పేరు వచ్చింది. ఊరు పేరు లేని వారికి ఇళ్లు, కార్లు కొనుక్కునే స్థాయిని ఈ కార్యక్రమం ఇహ్హ్యింది అంటే అతిశయోక్తి కాదు. అయితే జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి ఎంతో మంది బయటకు వెళ్లారు, వెళ్తూనే ఉన్నారు మళ్ళీ తిరిగి వచ్చేవారు కొందరు ఉంటే బయటి నుంచి వచ్చి క్రేజ్ తెచ్చుకుంటున్న వారు సైతం ఉన్నారు. ఇక జడ్జ్ లలో నాగబాబు బయటకు వెళ్లడంతో ఆయనతో పాటుగా చమ్మక్ చంద్ర కూడా వెళ్లాడు. చమ్మక్ చంద్ర వెళ్లడంతో ఆయనతో ఎక్కువగా స్కిట్స్ చేస్తూ వచ్చిన సత్య శ్రీ కూడా వెళ్లింది.
Mangalavaram: మంగళవారం అని అందుకే పెట్టాం… ఆ సామెత పట్టించుకోవద్దు: అజయ్ భూపతి
చమ్మక్ చంద్ర తన గురువు అని, ఆయన ఎక్కడుంటే తాను కూడా అక్కడే ఉంటాను అన్నట్టుగా కొన్ని రోజులు పాటు మైంటైన్ చేస్తూ వచ్చిన ఆమె ఆ తరువాత సత్య చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం చమ్మక్ చంద్రను వీడింది సత్య. చమ్మక్ చంద్ర సినిమాల్లో బిజీగా ఉండటంతో బుల్లితెరపై ఫోకస్ పెట్టడం లేదు ఈ క్రమంలో సత్యకి కూడా అంతగా పని లేకుండాపోయినట్టుంది. దీంతో సత్య మళ్లీ బుల్లితెరపై బిజీ కావాలని జబర్దస్త్ షోకు వచ్చి ఆ తరువాత కాస్త బిజీ అయింది. ఇదంతా ఆమె ప్రొఫెషనల్ లైఫ్ కాగా ఇప్పుడు ఆమె పర్సనల్ లైఫ్ లో మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. ఆమె నానమ్మ తాజాగా మరణించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సత్యశ్రీ తన నానమ్మను మిస్ అవుతున్నట్టుగా ఆమెతో దిగిన ఫోటోను షేర్ చేసింది.