Jabardasth Rakesh: కేసీఆర్ పై సినిమా.. నన్ను మోసం చేశారు.. ఇల్లు, కారు అమ్ముకొని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jabardasth Rakesh: జబర్దస్త్ ద్వారా పేరుతెచ్చుకున్న వారందరు.. ఒక్కొక్కరిగా వెండితెర మీదకు వస్తున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర కమెడియన్స్ గా రాణిస్తున్నారు. ఈ మధ్యనే వేణు డైరెక్టర్ గా మారి హిట్ అందుకున్నాడు. త్వరలోనే ధనరాజ్ డైరెక్టర్ గా మారుతున్నాడు. ఇక ఇప్పుడు జబర్దస్త్ రాకేష్ సైతం నిర్మాతగా మారాడు. అతనే హీరోగా.. గరుడవేగ అంజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కేసీఆర్. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను రాకేష్ రిలీజ్ చేసాడు. కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోనే ఈ సినిమాను తీస్తున్నట్లు తెలిపాడు. ఇక ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం ఆయన పడిన కటం గురించి వివరించాడు.
Mrunal Thakur: మృణాల్ కూడా హైదరాబాద్ కోడలే.. ఇదే సాక్ష్యం
Also Read
- Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
” నాకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన జీవిత కథను ఆధారంగా చేసుకోని ఈ సినిమను తీశాను. సినిమా అంటే కొన్ని కోట్లతో కూడుకున్న పని నాకూ తెలుసు. దాని కోసం నేను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లును తాకట్టు పెట్టాను. సినిమా నిర్మిస్తున్నా అనగానే బినామీ డబ్బులతో నిర్మిస్తున్నా అంటూ వార్తలు వచ్చాయి. ఇది నా కష్టంతో తీస్తున్న సినిమా. మొదట కొందరు వ్యక్తులు ఈ సినిమను నిర్మించడానికి ముందుకు వచ్చారు. కానీ, వాళ్లు వెనక్కి తగ్గడంతోనే ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చింది. ఎవరు దొరక్క.. చివరికి నేనే నిర్మాతగా మారాను. అలానే ఓ రైటర్ మోసం చేయడం వల్ల సినిమా మొదలు కావడానికి ముందే కారు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ సినిమా నిర్మాణం గురించి తెలిసి అమ్మతో పాటు భార్య సుజాత నన్ను ఎంకరేజ్ చేశారు. సుజాత తన బ్యాంక్ లో ఉన్న డబ్బు, నగలు అన్ని ఇచ్చింది. అంతేకాకుండా.. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యాస్టూమ్ డిజైనర్ గా ఇలా అన్ని పనులు తనే చేసింది. ఇందులో నటి సత్యకృష్ణ కూతురు అనన్య తొలిసారిగా నటిస్తోంది” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో రాకేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
-
CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
-
Chennai: ఏడేళ్ల నాటి మర్డర్ మిస్టరీ వీడింది.. చంపిందెవరంటే..!
-
Balloon Gas Cylinder Blast : మియాపూర్‌లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
-
Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!