ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ రీచ్ సాదించాడు కానీ నిజానికి ఇప్పుడు కాదు ఎన్టీఆర్ 19 ఏళ్ల వయసుకే, సరిగ్గా మూతి మీద మీసాలు కూడా లేని సమయంలోనే ఎన్టీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇంటన్స్, పవర్ ఫుల్ రోల్స్ తో నెవర్ బిఫోర్ మాస్ ని చూపించిన అప్పటి ఎన్టీఆర్ గురించి నందమూరి అభిమానులని అడిగితే కథలు కథలుగా చెప్తారు. మాన్ ఆఫ్ మాసెస్ అఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ మే 20న తనతో తనే పోటీ పడబోతున్నాడు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా రెండు సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇందులో ఒకటి ఆది సినిమాకాగా మరొకటి సింహాద్రి. రాజమౌళి డైరెక్ట్ చేసిన సింహాద్రి, వినాయక్ డైరెక్ట్ చేసిన ఆది సినిమాలు ఎన్టీఆర్ ఫాన్స్ కి చాలా స్పెషల్, అందుకే వీటిని రీరిలీజ్ చేస్తున్నారు అంటే ఫాన్స్ జోష్ లోకి వస్తున్నారు.
సింహాద్రి vs ఆది, రాజమౌళి vs వినాయక్, ఎన్టీఆర్ vs ఎన్టీఆర్ లా జరగబోయే పోటీతో రీరిలీజ్ ట్రెండ్ లో కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చెయ్యడానికి ఫాన్స్ రెడీగా ఉన్నారు. అయితే సింహాద్రి, ఆది సినిమాల్లో ఒకటే రీరిలీజ్ చేస్తే బాగుండేది అనే మాట కూడా వినిపిస్తోంది. రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే అది కలెక్షన్స్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏ సినిమాకి ఫుల్ గా డబ్బులు రావు. ఇది జరగకుండా ఉండాలి అంటే ఆది, సింహాద్రి సినిమాల్లో ఒకటే రిలీజ్ అవ్వాలి. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కాబట్టి సింహాద్రి సినిమానే రీరిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మే 20కి ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటిలోపు ఆది సినిమాని ఆపి సింహాద్రిని మాత్రమే రంగంలోకి దించుతారేమో చూడాలి.