యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినగానే అందరికీ ఒక మాస్ హీరో గుర్తొస్తాడు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటెన్స్ ఉన్న రోల్స్, వయోలెన్స్ చేసే రోల్స్ ఎక్కువగా పోట్రే చేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్థాయిలో మాస్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరో ఒక్కరు కూడా ప్రస్తుత ఇండస్ట్రీలో లేడు అంటే ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అందుకే పాన్ ఇండియా ఆడియన్స్ ఎన్టీఆర్ ని మాన్ ఆఫ్ మాసెస్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే పిలుస్తున్నారు. ఇంతటి మాస్ హీరో క్లాస్ గా కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేసిన సుకుమార్, ఎన్టీఆర్ ని పెట్టి ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేశాడు. కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే ఎన్టీఆర్, తన 25వ సినిమాకి సేఫ్ జోన్ లో ఉండి మాస్ సినిమా చేస్తాడు అని అందరూ అనుకుంటారు కానీ తారక్ మాత్రం సుకుమార్ తో కలిసి అందరికీ షాక్ ఇచ్చే రేంజులో క్లాస్ సినిమా చేశాడు.
నాన్నకు ప్రేమతో సినిమాలో కనిపించినంత స్టైలిష్ గా ఎన్టీఆర్ ఇప్పటివరకూ ఇంకో సినిమాలో కనిపించలేదు అంటే సుకుమార్, ఎన్టీఆర్ ని ఏ రేంజులో ప్రెజెంట్ చేశాడో అర్ధం చేసుకోవచ్చు. భారి ఫైట్స్ లేకుండా, హెవీ డైలాగ్స్ లేకుండా కేవలం ఫాదర్ ఎమోషన్ పైనే నాన్నకు ప్రేమతో సినిమా ట్రావెల్ అవుతుంది. ఈ మూవీతో ఎన్టీఆర్ కంప్లీట్ గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు, బాక్సాఫీస్ దగ్గర మాస్ సినిమాతోనే కాదు క్లాస్ సినిమాతో కూడా హిట్ కొట్టగలను అని నిరూపించాడు. తారక్ నుంచి అస్సలు ఊహించని ఈ మూవీ రిలీజ్ అయ్యి నేటికి ఏడేళ్లు, ఎన్టీఆర్ క్లాస్ గా కనిపించి ఏడేళ్లు అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్ ట్వీట్స్ వేస్తున్నారు.
Celebrating 7️⃣ years of Young Tiger @tarak9999 & @aryasukku's Heart touching Entertainer ❤️ #NannakuPrematho. #7YearsOfNannakuPrematho@Rakulpreet #RajendraPrasad @IamJagguBhai @ThisIsDSP @SVCCofficial @Shibasishsarkar @RelianceEnt pic.twitter.com/ILHbhwgu0Z
— SVCC (@SVCCofficial) January 13, 2023