Kushi 4K: ఖుషి రీరిలీజ్… సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో అభిమానులకి బాగా నచ్చిన చిత్రం ఏది అంటే మెజారిటీ ఫాన్స్ నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ఖుషి’. ఎస్.జే సూర్య డైరెక్ట్ చేసిన ‘ఖుషి’ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్ 7వ సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీలో భూమిక హీరోయిన్ గా నటించింది. ‘ఖుషి’ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్ ఉంటాయి. ఈ ప్రేమ కథా చిత్రానికి అతిపెద్ద బలం సంగీతం. మణిశర్మ ‘ఖుషి’ సినిమాకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. 2001లో దాదాపు ఆ ఏడాది మొత్తం ‘ఖుషి’ పాటలు మోతమోగుతునే ఉన్నాయి అంటే మణిశర్మ చేసిన మ్యాజిక్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ‘ఖుషి’ సినిమా పాటలే కాదు ఈ మూవీలో మణిశర్మ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ట్రెండ్ సెట్టర్ అయ్యింది. అప్పట్లో ప్రతి ఒక్కరి ఫోన్ కి ‘ఖుషి’ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రింగ్ టోన్ గా ఉండేది.
ఇలాంటి ఒక మోడరన్ క్లాసిక్ లవ్ స్టొరీ సినిమా మళ్లీ రీరిలీజ్ అయ్యింది. ఇటీవలే రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా రిలీజ్ అయిన ఖుషి మూవీ నాలుగు కోట్లకి పైగా రాబట్టింది. రీరిలీజ్ ట్రెండ్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ఖుషి నిలిచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 27 ఏళ్లు అయిన సంధర్భంగా ఫ్యాన్స్ ఖుషి సినిమా మళ్లీ రీరిలీజ్ చేసుకోని థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో #Kushi4K #27YearsOfPAWANISM అనే ట్యాగ్స్ ని క్రియేట్ చేసి థియేటర్స్ నుంచి ఖుషి సినిమా సెలబ్రేషన్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ చూస్తే ఖుషి సినిమా ఇంకో పది సార్లు రీరిలీజ్ అయినా కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందేమో.
Also Read
- Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
- YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
- Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!