మెగాస్టార్ చిరంజీవి.. స్వయంకృషితో పైకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగి ఎంతోమంది హీరోలకు ఆదర్శంగా నిలిచారు. ఇంకెంతమంది హీరోలు వచ్చినా.. మెగా ఫ్యామిలీలోని హీరోలైన మరో మెగాస్టార్ కాలేరు అనేది అందరికి తెలిసిన విషయమే. చివరికి మెగా వారసుడు రామ్ చరణ్ కూడా మెగాస్టార్ స్టామినాను కానీ, చార్మింగ్ ని కానీ, డాన్స్ లో ఆ గ్రేస్ ని కానీ మళ్లీ తీసుకురాలేడని అభిమానుల అభిప్రాయం. ఇక ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. నెక్స్ట్ మెగాస్టార్ అంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ని చిరంజీవితో పోలుస్తూ.. అతనే సరికొత్త మెగాస్టార్ అని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. బన్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఒదిగి ఉండే తనం అన్ని మెగాస్టార్ ని పోలి ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.
ఇక మొన్నటికి మొన్న ఆహా లో కూడా మెగాస్టార్ అల్లు అర్జున్ స్పెషల్ ఎపిసోడ్ అంటూ ప్రమోట్ చేయడం విశేషం. ఇక తాజాగా ఈ వార్తలపై బన్నీ అన్న, గని నిర్మాత అల్లు బాబీ స్పందించాడు. గని ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ” బన్నీని మెగాస్టార్ తో పోల్చడం పద్దతి కాదు.. చిరంజీవి స్వయం కృషితో పైకి వచ్చారు. కానీ బన్నీ వెనుక తన తండ్రి, తాత ఉన్నారు. నేను ఎప్పటికీ చిరంజీవి – అల్లు అర్జున్ లను పోల్చి చూడను. నేనే కాదు ఫ్యామిలీ లో అందరికి చిరంజీవి గారే స్ఫూర్తి.. అల్లు అర్జున్ కూడా ఎన్నో సార్లు ఇదే విషయాన్నీ చెప్పుకొచ్చాడు. అలాంటి స్ఫూర్తి నింపిన వ్యక్తితో పోల్చుకోవడం పద్దతి కాదు .. బన్నీ ఎప్పటికి మెగాస్టార్ కాలేడు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏది ఏమైనా బాబీ చెప్పిన మాటల్లోనూ నిజం లేకపోలేదు. ఒక పెద్ద మహా వృక్షం .. మరే చెట్టుతో పోల్చడానికి కుదరదు.. మెగా ఫ్యామిలీకే కాదు ఇండస్ట్రీకే చిరు మహా వృక్షం అని అభిమానులు కొనియాడుతున్నారు.
