బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్గుగుమ్మ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ తో అనన్య కొన్నేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. అనన్య పాండే- ఇషాన్ ఖట్టర్ ఖలీపిలీలో కలిసి నటించినప్పటి నుంచి ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పలేదు కానీ.. పార్టీలు, పబ్ లు అంటూ ఎక్కడ చుసిన వీరే కనిపించడంతో వీరు డేటింగ్ లో ఉన్నారు అనే వార్త వైరల్ గా మారింది.
ఇక తాజాగా వీరి ప్రేమ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది ఇషాన్ ఖట్టర్ తల్లి, ప్రముఖ నటి నీలిమా అజీమ్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మే మాట్లాడుతూ ” అనన్య మా ఫ్యామిలీ సర్కిల్స్ లో ఒకరు.. ఆమె నా కొడుకుకు మంచి సహచరురాలు. షాహిద్, మీరాతో కూడా ఆమె చాలా బాగా మాట్లాడుతోంది. ఇక ఇషాన్ ఫ్రెండ్ తో అయితే ఇట్టే కలిసిపోతుంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇంకేముంది కాబోయే కోడలు గురించి అత్తగారు ఇంత గొప్పగా పొగుడుతుంది.. త్వరలోనే ఈ జంట కూడా పెళ్లి పీటలు ఎక్కనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. మరి అనన్య ఈ విషయంపై ఎప్పుడు నోరువిప్పుతుందో చూడాలి.
