NTV Telugu Site icon

Acharya : కాజల్ రోల్ కత్తిరించేశారా ?

Kajal

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కలిసి నటించిన “ఆచార్య” మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ట్రైలర్ లో ఎక్కడా కాజల్ కనిపించకపోవడం గమనార్హం. పూజాహెగ్డే కనీసం ఎక్కడో ఒక చోట తళుక్కున మెరిసింది. కానీ మెయిన్ హీరోయిన్ గా తీసుకున్న కాజల్ ఒక్క ఫ్రేములో కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. తాజాగా కాజల్ రోల్ లో సినిమాలో నుంచి పూర్తిగా కత్తిరించేశారని ప్రచారం జరుగుతోంది. తల్లి కాబోతున్న కాజల్ ఇటీవలి నెలల్లో అనేక ప్రాజెక్ట్‌ల నుండి తప్పుకుంది. ఇక సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్ గా ఉండే కాజల్ తాజాగా విడుదలైన “ఆచార్య” ట్రైలర్ ను తన పేజీలో కనీసం షేర్ చేయలేదు. దీంతో సినిమాలో నుంచి కాజల్ పోర్షన్ ను పూర్తి లేపేశారని, అసలు కాజల్ తన షూట్‌లో ఇంకా కొంత భాగాన్ని పూర్తి చేయనే లేదని అంటున్నారు. చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్‌లో మాత్రమే కాజల్ కనిపించనుందని టాక్ నడుస్తోంది. మరి కాజల్ ను జస్ట్ ట్రైలర్ లో చూపించలేదా ? లేదా సినిమాలోనే చూపించలేదా ? అనేది తెలియాల్సి ఉంది.

Read Also : South Cinema : బాలీవుడ్ ను ఆక్రమించేసిన సౌత్… నెల నుంచి మనదే హవా !

ఇప్పటికే ట్రైలర్ చెర్రీ డామినేషన్ ఎక్కువైందని కామెంట్స్ వస్తుండగా, మళ్ళీ కాజల్ రోల్ గురించి చర్చ నడవడం ఆసక్తికరంగా మారింది. కాగా “ఆచార్య” చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తండ్రీకొడుకులు చిరు, చరణ్ కలిసి కన్పించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్, సౌరవ్ లోకేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అజయ్, సంగీత తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show comments