Acharya : కాజల్ రోల్ కత్తిరించేశారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ట్రైలర్ లో ఎక్కడా కాజల్ కనిపించకపోవడం గమనార్హం. పూజాహెగ్డే కనీసం ఎక్కడో ఒక చోట తళుక్కున మెరిసింది. కానీ మెయిన్ హీరోయిన్ గా తీసుకున్న కాజల్ ఒక్క ఫ్రేములో కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. తాజాగా కాజల్ రోల్ లో సినిమాలో నుంచి పూర్తిగా కత్తిరించేశారని ప్రచారం జరుగుతోంది. తల్లి కాబోతున్న కాజల్ ఇటీవలి నెలల్లో అనేక ప్రాజెక్ట్‌ల నుండి తప్పుకుంది. ఇక సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్ గా ఉండే కాజల్ తాజాగా విడుదలైన “ఆచార్య” ట్రైలర్ ను తన పేజీలో కనీసం షేర్ చేయలేదు. దీంతో సినిమాలో నుంచి కాజల్ పోర్షన్ ను పూర్తి లేపేశారని, అసలు కాజల్ తన షూట్‌లో ఇంకా కొంత భాగాన్ని పూర్తి చేయనే లేదని అంటున్నారు. చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్‌లో మాత్రమే కాజల్ కనిపించనుందని టాక్ నడుస్తోంది. మరి కాజల్ ను జస్ట్ ట్రైలర్ లో చూపించలేదా ? లేదా సినిమాలోనే చూపించలేదా ? అనేది తెలియాల్సి ఉంది.
Read Also : South Cinema : బాలీవుడ్ ను ఆక్రమించేసిన సౌత్… నెల నుంచి మనదే హవా !
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఇప్పటికే ట్రైలర్ చెర్రీ డామినేషన్ ఎక్కువైందని కామెంట్స్ వస్తుండగా, మళ్ళీ కాజల్ రోల్ గురించి చర్చ నడవడం ఆసక్తికరంగా మారింది. కాగా “ఆచార్య” చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తండ్రీకొడుకులు చిరు, చరణ్ కలిసి కన్పించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్, సౌరవ్ లోకేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అజయ్, సంగీత తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..