2022లో ఎన్టీఆర్ రిలీజెస్ ఎన్ని!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2018 అక్టోబర్ లో ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ విడుదల అయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చే జనవరిలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు జూనియర్. గత మూడేళ్లుగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’కే పూర్తిగా అంకితమయ్యాడు ఎన్టీఆర్. ఇందులో తనతో కలసి నటించిన రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో పాటు సమాంతరంగా ‘ఆచార్య’ పూర్తి చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం వేరే ఏ సినిమా చేయలేదు. మూడేళ్ళకు పైగా వచ్చిన గ్యాప్ ని వచ్చే ఏడాది 2022లో ఫిల్ చేసుకోబోతున్నాడు జూనియర్. ఆ ఏడాది రెండు సినిమా రిలీజ్ లపై కన్నేశాడు.
ఎన్టీఆర్ అభిమానులకు పండగలాంటి వార్త ఇది. యంగ్ టైగర్ 2022లో రెండు సినిమాలను ప్రారంభించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించే ఎన్టీఆర్ 30 ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అక్టోబరుకి షూటింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నాడు. ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ చిత్రం అక్టోబర్ లో మొదలు కానుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ‘సాలార్’ తీస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్31ని నిర్మించనుంది. ఆ తర్వాత ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. అయితే 2022లో ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమాలు రెండు విడుదల అవటం ఖాయం. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7, 2022న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ కానుంది. ఇక కొరటాల సినిమా కూడా వచ్చే సంవత్సరాంతంలో విడుదల అవుతుంది. ఇక 2023లో ఎన్టీఆర్ సినిమాలు రెండు రిలీజ్ కావటం ఖాయం. ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలసి యూరప్‌లో పర్యటిస్తున్నాడు.
Also Read
తాజావార్తలు
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!