సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 650 కోట్లు కలెక్ట్ చేసింది. రజినీ రేంజ్ ఏంటో చూపించిన ఈ మూవీ సెకండ్ హాఫ్ లో రజినీకాంత్ జైలర్ లుక్ లో రివీల్ అవ్వగానే థియేటర్స్ ఒక్కసారిగా ఎరప్ట్ అయ్యాయి. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రజినీ జైలర్ గెటప్ థియేటర్స్ పునాదులు కదిలించేలా చేసాయి. ఇప్పుడు ఇలాంటిదే తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగనుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా మరో 48 గంటల్లో రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా హ్యూజ్ హైప్ ని మైంటైన్ చేస్తుంది. ఈ అంచనాలని మరింత పెంచడానికి, నందమూరి అభిమానులని మరింత ఎగ్జైట్ చేయడానికి భగవంత్ కేసరి గురించి ఒక సాలిడ్ న్యూస్ బయటకి వచ్చింది.
భగవంత్ కేసరి సినిమాలో ఇంటర్వెల్ తర్వాత… బాలయ్య పోలిస్ గెటప్ లో కనిపించబోతున్నాడట. దాదాపు 15 నిమిషాల పాటు ఉండబోయే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన కంటెంట్ ని రిలీజ్/రివీల్ చేయకుండానే అనిల్ రావిపూడి భగవంత్ కేసరి ప్రమోషన్స్ ని చేసాడు. థియేటర్స్ లో డైరెక్ట్ గా బాలయ్యని పోలీస్ గెటప్ లో చూడగానే, థమన్ కూడా అదే సమయంలో డ్యూటీ ఎక్కగానే థియేటర్స్ ఒక్కసారిగా పూనకాలు వచ్చినట్లు ఊగిపోవడం గ్యారెంటీ. రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీ నరసింహా రేంజులో అనీల్ రావిపూడి, బాలయ్యకి మూడు సీన్లు వేస్తే చాలు భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం గ్యారెంటీ. మరి భగవంత్ కేసరి అక్టోబర్ 19 బాక్సాఫీస్ దగ్గర యూనిఫార్మ్ వేసుకోని ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.