కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కథ నచ్చితే ప్రయోగాలు చేయడానికి కానీ, ఆ సినిమాలో క్యామియో రోల్ చేయడానికి కానీ వెనుకాడడు. అలాగే విక్రమ్ లో రోలెక్స్ గా కనిపించి మెప్పించాడు. విక్రమ్ లో సూర్య కనిపించింది కొద్దిసేపే అయినా హీరో కన్నా ఎక్కువ పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య మరో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. అది కూడా ఈ హీరో నటించిన సినిమానే కావడం విశేషం.. విషయం ఏంటంటే.. సూర్య ప్రధాన పాత్రలో సుధా కొంగర దర్శహకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’.
డైరెక్ట్ ఓటిటీ లో రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డులకు కూడా ఎంపిక అయ్యింది. ఇక ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తోంది సుధా కొంగర.. సూర్య పాత్రలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సూర్య- జ్యోతిక కలిసి నిర్మించడం విశేషం. ఇక నిర్మించడమే కాకుండా ఈ సినిమాలో ఒక క్యామియో రోల్ లో సూర్య కనిపించనున్నాడు. దీంతో ఈ చిత్రంపైనా అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. తాను నటించిన సినిమా .. తానే రీమేక్ చేస్తూ అందులో తానే గెస్ట్ గా కనిపించడం విశేషం. తెలుగు, తమిళ్ భాషల్లో భారీ విజయాన్నీ అందుకున్న ఈ సినిమా హిందీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.