అనంతపురంలో కూలిన 4అంతస్థుల భవనం..

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ తిరుచానూరు, తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో వరద తాకిడికి భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కదిరిలో నిర్మాణంలో ఉన్న 4 అంతస్థుల భవనం కూలిపోయింది.

Also Read:అక్కడికి వెళ్లి ఎంతమంది చనిపోయారో తెలియడం లేదు : వైసీపీ ఎమ్మెల్యే

అంతేకాకుండా ఆ భవనం పక్కనే ఉన్న మరో 2 అంతస్థుల భవనంపై పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. 2 అంతస్థుల భవనంలో 10 మంది అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. భవన శిథిలాల కింద 10 మంది ఇరుకున్నట్లు సమాచారం. అయితే సంఘటన స్థలానికి చేరుకునన అధికారులు, పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింది నుంచి 4గురు ప్రాణాలతో బయటపడగా.. ఇద్దురు చిన్నారులు మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

Latest Articles