Indraja Shankar: పెళ్లి పీటలు ఎక్కనున్న బిగిల్ గుండమ్మ.. డైరెక్టర్ ను ప్రేమించి.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indraja Shankar: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమార్తె ఇంద్రజ శంకర్ నిశ్చితార్థం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా జరిగింది. ఇంద్రజ కూడా నటినే. తండ్రిలానే ఆమె కుండా లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళ్ మూవీ బిగిల్ లో గుండమ్మగా ఆమె ఎంతో ఫేమస్ అయ్యింది. ఇక పాగల్ సినిమాలో విశ్వక్ ప్రేమలో పడే అమ్మాయిగా కూడా ఇంద్రజ కనిపించి మెప్పించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇంద్రజకు డైరెక్టర్ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిది ప్రేమ వివాహమని కొందరు అంటుండగా .. మరికొందరు పెద్దలు కుదిర్చిన వివాహమని చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ జంట వివాహం మరో నెలలో జరగనుందని తెలుస్తోంది. చెన్నైలో వీరి వివాహాం గ్రాండ్ గా జరగనుందని సమాచారం. ఈ పెళ్ళికి కోలీవుడ్ సెలబ్రిటీలు అందరు హాజరుకానున్నారని సమాచారం.
ఇక రోబో శంకర్ గురించి తెలుగువారికి కూడా తెల్సిందే. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శంకర్ రోబో డ్యాన్స్ ద్వారా రోబో శంకర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార అనే సినిమాలో రోబో శంకర్ కు గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తరువాత రోబో శంకర్ స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పిస్తున్నాడు. అంతేకాకుండా రోబో షాంక్స్.. ఒక్కసారిగా బరువు తగ్గి అప్పట్లో హాట్ టాపిక్ గా మారాడు.
Also Read
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!