SSMB29: కొత్త ఏడాది మొదలయ్యింది అంటే.. అందరి చూపు SSMB29 మీదనే ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు జక్కన్న తన సినిమాను పట్టాలెక్కించింది లేదు. మహేష్ బాబుతో తదుపరి సినిమా ఉంటుంది అని అధికారిక ప్రకటన వచ్చినప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. ఇక అంతే కాకుండా ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి అయింది. హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా ఈ సినిమాలో పనిచేసే అవకాశం ఉంది. ఈ మధ్యనే ఈ సినిమా బడ్జెట్ రూ. 1000 కోట్లు అంటూ వార్తలు వచ్చాయి. వాటినే ఇంకా ట్రెండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రం కోసం జక్కన్న మరో హాలీవుడ్ భామను దింపబోతున్నాడట.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ ను దింపాడు. ఈ చిన్నది ఆర్ఆర్ఆర్ తరువాత ఎంత పేరు తెచ్చుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా మహేష్ కోసం ఇండోనేషియా భామ ఎలిజబెత్ చెల్సియా ఇస్లాన్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఈ భామ చూడడానికి కొంచెం చైనీస్, జపనీస్ అమ్మాయిలా కనిపిస్తోంది. కానీ, చూడడానికి ఎంతో అందంగా ఉంది. మహేష్ పక్కన చక్కగా సెట్ అయ్యేలానే కనిపిస్తుంది. దీంతో మంచు ఛాయిస్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.