అసలు కమల్ హాసన్.. ప్రభాస్‌కు విలన్‌గా నటించడం ఏంది సామి? ఇది సాధ్యమయ్యే పనేనా? అని అనుకున్నారు మొదట్లో జనాలు. దాంతో.. ఇది జస్ట్ రూమర్ మాత్రమేనని అనుకున్నారు కానీ తాజాగా మేకర్స్ నుంచి అఫిషీయల్ అనౌన్స్మెంట్ బయటికి రావడంతో ప్రాజెక్ట్ కె పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఊహకందని సైన్స్ ఫిక్షనల్ మూవీగా ప్రాజెక్ట్ K తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్, అందుకు తగ్గట్టే స్టార్ క్యాస్టింగ్‌ను తీసుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీస్ దీపిక పదుకొని, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇక ఇప్పుడు లోక నాయకుడు కమల్ హాసన్ ప్రాజెక్ట్ కెలో జాయిన్ అవడంతో ‘ప్రాజెక్ట్ కె’ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. అది కూడా కమల్ హాసన్ విలన్ అంటే.. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు లోకనాయకున్ని తన సినిమాల్లో తప్పితే నెగెటివ్ రోల్‌లో పెద్దగా చూడలేదు కానీ ప్రభాస్ కోసం విలన్ అవతారం ఎత్తాడంటే ప్రాజెక్ట్ కెతో నాగ్ అశ్విన్ ఏదో చేసేలానే కనిపిస్తున్నాడు.
ఈ సినిమా కోసం కమల్ నాలుగు వారాల కాల్షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కమల్ హాసన్‌కు సంబంధించిన షూటింగ్ అయిపోతే.. ప్రాజెక్ట్ కెకి గుమ్మడికాయ కొట్టేయనున్నారు. ఇక కమల్ రాకపై ఇన్‌స్టాలో ప్రభాస్… “నా గుండెల్లో ఎప్పటికీ దాచుకునే ఒక బ్యూటిఫుల్ మూమెంట్.. ప్రాజెక్ట్ కెలో కమల్ హాసన్ గారితో నటించే అవకాశం దొరకడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.. ఈ కలయికతో చాలా నేర్చుకుంటాం..” అని పోస్ట్ చేసాడు. కమల్ ఎంట్రీపై బిగ్ బీ కూడా ట్వీట్ చేస్తూ… “గ్రేట్ వర్కింగ్ విత్ యు అగైన్… వెల్కమ్ కమల్” అంటూ ట్వీట్ చేసాడు. అమితాబ్, కమల్ కలిసి ‘గిరఫ్తార్’, ‘ఖబర్దార్’ నటించారు. 1985 తర్వాత ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని కలిపినా ఘనత ప్రాజెక్ట్ K సినిమాకి దక్కింది. మరి ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా లాంటి స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె ఎలా ఉంటుందో తెలియాలంటే జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే.
“A moment that will be etched in my heart forever. Honored beyond words to collaborate with the legendary @iKamalHaasan sir in #ProjectK. The opportunity to learn and grow alongside such a titan of cinema is a dream come true moment”
T 4686 – Welcome Kamal .. great working with you again .. it’s been a while !#TheKsurprise @ikamalhaasan #ProjectK @SrBachchan #Prabhas @deepikapadukone @DishPatani @nagashwin7 @Music_Santhosh @VyjayanthiFilms pic.twitter.com/nMMmWJRGM1
— Amitabh Bachchan (@SrBachchan) June 25, 2023