టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా నోటీసులు పంపారు. తెలుగులో అగ్రగామి సంస్థగా సినిమాలు రూపొందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై GBU సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బెస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది.
Also Read : Tollywood Actress : హీరోయిన్స్ కెరీర్ కు విలన్స్ గా మారుతున్న యంగ్ హీరోలు
అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో ఒకప్పటి తమిళ్ సినిమాలలోని ఇళయరాజా సంగీతం అందించిన సాంగ్స్ ను గుడ్ బ్యాడ్ అగ్లీలో వారిని రీమిక్స్ చేసి ఉపయోగించారు. ఆ సదరు సీన్స్ థియేటర్స్ లో ఫ్యాన్స్ ఆ సాంగ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబందించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తన పాటను అనధికారికంగా వాడుకోవటం పై ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేసారు. సినిమాలో తన పాటలు వాడడం పై నోటీసులు ఇచ్చారు ఇళయరాజా. నష్టపరిహారం కింద తనకు ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు నోటీసులు పంపారు ఇళయరాజా. అదే విధంగా గుడ్ బ్యాడ్ అగ్లీలోని మూడు పాటలను వెంటనే నిలిపివేయాలని మరియు 7 రోజుల్లోగా చిత్ర బృందం బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఇళయరాజా డిమాండ్ చేసారు. మరి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఈ నోటిసులపై ఎలా స్పందిస్తారో చూడాలి.