స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్ అయ్యింది. పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పడానికి కలెక్షన్ల కొలతలు ఉన్నాయి కానీ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని చెప్పే మీటర్ మాత్రం లేదు. అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని అమలాపురం నుంచి ఆస్ట్రేలియా వరకూ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు అంటే పుష్ప ది రైజ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రేజ్ ని కాష్ చేసుకుంటూ పుష్ప ది రూల్ సినిమాని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే రోజున సూపర్బ్ వీడియో రిలీజ్ చేసి, సాలిడ్ హైప్ ని రాబట్టాడు. వేర్ ఈజ్ పుష్ప అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం’ అనే డైలాగ్ ని ఫాన్స్ ఫిదా అయ్యారు.
యుట్యూబ్ లెక్కలు మారుస్తున్న ఈ వీడియో పుష్ప 2 సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో క్లియర్ కట్ గా చెప్పేసింది. అంచనాలని మించే రేంజులో పుష్ప సినిమాకి గ్లోబల్ టచ్ ఇచ్చిన సుకుమార్, ఎర్ర చందనం స్మగ్లింగ్ ని చైనాతో లింక్ చేశాడు. టైటిల్ ఫాంట్ లో చైనీస్ డిజైన్ ఉండడంతో, సుకుమార్ ఏం ప్లాన్ చేశాడో అనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరిగింది. పోస్టర్ లో ఇచ్చిన చైనా హింట్ ని నిజం చేస్తూ సుకుమార్, రామోజీ ఫిల్మ్ సిటీలో ఫారిన్ ఫైటర్స్ లో భారి యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్, ఫారిన్ ఫైటర్స్ మధ్య తెరకెక్కిస్తున్న ఈ ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉండబోతుందని సమాచారం. మరి మన స్మగ్లర్ పుష్పరాజ్, ఫారిన్ ఫైటర్స్ తో ఎలాంటి యాక్షన్ చేస్తున్నాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.