I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
I Am Game: మాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే కేరళతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలవుతుంది. ఇప్పుడు అలాంటి అంచనాలతో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ రిలీజ్ కు ముందే టెన్షన్ పెడుతోంది. ఆగస్టు 20న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా అనుకున్న తేదీకే వస్తుందా? లేక చివరి నిమిషంలో వాయిదా పడుతుందా అనే సస్పెన్స్ ను క్రియేట్ చేస్తోంది. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఐ యామ్ గేమ్’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సినిమా కథకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం పెద్దగా రివీల్ చేయకుండా సస్పెన్స్ ను కొనసాగిస్తోంది. 2026ఆగస్టు 20న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
అయితే ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో కొంత జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా అనుకున్న డేట్ కి సినిమా రిలీజ్ కావడం కష్టమయ్యే అవకాశముందని ప్రచారం మొదలైంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఆఫీషియల్ గా ఏ ప్రకటన కూడా రాలేదు. దీంతో ‘ఐ యామ్ గేమ్’ రిలీజ్ డేట్ కి వస్తుందా ? వాయిదా పడుతుందా అన్నది సస్పెన్స్ గానే ఉంది. ఒకవేళ సినిమా నిజంగానే ఆగస్టు 20 నుంచి వాయిదా పడితే, అదే రోజున థియేటర్లలోకి రావాల్సిన పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’కు ఇది అనుకూలంగా మారే అవకాశం ఉంది. ‘ఐ యామ్ గేమ్’ తప్పుకుంటే ‘ఖలీఫా’ ఆ తేదీన సోలో రిలీజ్‌గా నిలిచే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మమితా బైజు నటించిన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’కు కూడా పోటీ కొంత తగ్గుతుంది. దీంతో ఈ రిలీజ్ డేట్ చుట్టూ మాలీవుడ్‌లో ఆసక్తికరమైన పరిస్థితి ఏర్పడింది.
Also Read
‘ఐ యామ్ గేమ్’లో దుల్కర్ సల్మాన్‌తో పాటు కయాదు లోహర్, ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కతిర్, సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. నహాస్ హిదాయత్ దర్శకత్వం కావడం, యాక్షన్ థ్రిల్లర్ జానర్ కావడం దుల్కర్ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘ఐ యామ్ గేమ్’ మలయాళ ప్రేక్షకులకే పరిమితం కాకుండా తెలుగులో కూడా విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ రిలీజ్ కు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి మాత్రం ఆగస్టు 20 తేదీపైనే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమయానికి పూర్తయితే సినిమా అనుకున్న తేదీకే రావచ్చు. లేదంటే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగేలా కనిపిస్తోంది.
- Tags
- cinema
- Dulquer Salmaan
తాజావార్తలు
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..