Hyper Aadi: జనసేనకు 24 సీట్లు.. ఎమోషనల్ అయిన హైపర్ ఆది.. ఆ హక్కు మనకు లేదు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyper Aadi: జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకొని స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న నటుల్లో హైపర్ ఆది ఒకడు. టాలెంట్ ను నమ్ముకొని జబర్దస్త్ లో అడుగుపెట్టి.. ఆనతి కాలంలోనే టీమ్ లీడర్ గా మారి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక సినిమాల్లో ఒక పక్క కమెడియన్ గా చేస్తూనే .. ఇంకోపక్క డైలాగ్ రైటర్ గా మారి తన సత్తా చూపిస్తున్నాడు. ఇక హైపర్ ఆది సినిమా విషయాలు పక్కన పెడితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆయన పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెల్సిందే. జనసేన కార్యకర్తగా స్టేజిపై ఎన్నో ప్రసంగాలు ఇచ్చాడు.. ఎంతోమందిని విమర్శించాడు కూడా. పవన్ ను ఎవరైనా ఏదైనా అంటే.. డైరెక్ట్ గా అయినా.. ఇన్ డైరెక్ట్ అయినా వారికి తనదైన స్టైల్లో ఇచ్చిపడేస్తాడు. ఇక తాజాగా హైపర్ ఆది ఎమోషనల్ అయ్యాడు. టీడీపీ- జనసేన పొత్తులో జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడంతో పవన్ అభిమానులే ఆయనను దుయ్యబట్టారు. ఈ విషయమై హైపర్ ఆది ఒక వీడియోను రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయే రకం కాదని, సినిమాలు చేస్తూ కోట్లు గడించే సత్తా ఉన్నా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తి అని చెప్పుకొచ్చాడు.
” ఎటువంటి అవినీతి చేయకుండా.. తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్లు మనం కూడా మాట్లాడితే.. నిజంగా బాధ అనిపించింది. అంటే 24 సీట్లు ఏంటి.. అదేంటి.. ఇదేంటి అని మాట్లాడుతున్నారు. 2019 లో కనీసం ఆయనను కూడా గెలిపించుకోలేని మనం.. అదేంటి, ఇదేంటి అని అడిగే హక్కు నిజంగా మనకు ఉంది అంటారా.. ? ఒక చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే ఒక పదిరోజులు ఇంట్లో నుంచి బయటికి రాము. అలాంటిది ఇంత పెద్ద ప్రజా సంగ్రామంలో రెండు చోట్ల ఓడిపోయి కూడా రెండో రోజే సమస్య అనగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సమస్యను సాల్వ్ చేసిన గొప్ప మనసు పవన్ కళ్యాణ్ గారిది. తన పిల్లల కోసం బ్యాంక్ లో దాచిన డబ్బును కూడా తీసి కౌలు రైతుల కష్టాలు తీర్చిన మన పవన్ కళ్యాణ్ గురించా ఇలా మాట్లాడేది. ఎన్నో సమస్యల మీద ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తిత్వం. రోజుకు రెండుకోట్లు తీసుకొనే ఒక స్టార్ హీరో.. సంపాదించిందంతా సహాయకార్యక్రమాలకు పెట్టేసి, ఆల్మోస్ట్ అప్పుచేసి పార్టీని నడుపుతున్నాడు అని ఎంతమందికి తెలుసు.
Also Read
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
- The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు.. ఎవరైనా సరే.. మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అనేవాళ్లే కానీ, ప్రతిపక్షంలో ఉండగా.. ఏనాడైనా వారి జేబులో నుంచి ఒక రూపాయి తీసి సహాయం చేశాడా.. ? అలా సహాయం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని.. కులాన్ని తాకట్టు పెట్టాడు.. పార్టీని తాకట్టు పెట్టాడు.. ప్యాకేజ్ తీసుకున్నాడు అని చాలా ఈజీగా అనేస్తున్నారు. అమ్మలాంటి కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టే వ్యక్తా పవన్ కళ్యాణ్ గారు. డబ్బుకు అమ్ముడుపోతాడా.. ? ప్రతిపక్షంలో టీడీపీ కంటే.. అధికారిక పక్షంలో ఉండే వైసీపీలో ఎక్కువ డబ్బు ఉంటుందిగా.. మరి అక్కడకు ఎందుకు వెళ్ళలేదు. ఎందుకండీ ఈ మాటలు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల ప్రేమకు బానిసలు కానీ, నాయకులు పంచే డబ్బుకు ఎప్పటికీ బానిస కాదు. అభిమానించడం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం, అనుకూలంగా లేనప్పుడు బై చెప్పడం కాదు. ఒక నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండడాన్నే అభిమానం అంటారు. అదే నిజమైన అభిమానం అంటారు. ఎవరో రెచ్చగొట్టే మాటలు.. జాలి చూపించే మాటలు .. వాటిని చూసి మన నాయకుడును తక్కువ చేసి మాట్లాడకూడదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆది వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Hyper Aadi about @PawanKalyan pic.twitter.com/DPzNLsOY32
— Kalyan Babu™ (@ram_aduri) February 26, 2024
తాజావార్తలు
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!