Hyper Aadhi: పవన్ కళ్యాణ్ తర్వాత ఆ హీరోనే అన్న ఆది.. చెప్పుతో కొడతామంటున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyper Aadhi: జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైపర్ పంచ్ లతో ప్రేక్షకులను నవ్వించడంలో దిట్ట ఆది. ఇక ఆది పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద ఫ్యానో అందరికి తెల్సిందే. బండ్ల గణేష్ తరువాత పవన్ ను తప్పుగా మాట్లాడిన వారిని ఏకిపారేస్తాడు. నిత్యం పవన్ గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్తూ వచ్చే ఆది ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే డ్యాన్స్ షోలో యాంకర్ గా చేస్తున్న విషయం విదితమే. ఇక ఆ షో లో తనదైన పంచులతో అలరించే ఈ కమెడియన్ నోరు జారీ పవన్ ను మరొక హీరోతో పోల్చి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ అతగాడిని ఏకిపారేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందటే.. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్ర ప్రమోషన్స్ కోసం ఆ షో కు వెళ్లాడు. ఈ షో లో కిరణ్ గురించి ఆది మాట్లాడుతూ “బేసిక్ గా నాకు పవన్ కళ్యాణ్ గారంటే బాగా ఇష్టం. ఆయన మాట విన్నా, ఆయన పాట విన్నానోటికి తెలియకుండా అరుపులు, చేతికి తెలియకుండా చప్పట్లు, వేళ్లకు తెలియకుండా విజిల్స్ వస్తాయి.. నాకు తెలిసి మళ్లా ఆ స్థాయికి వెళ్లే హీరో ఎవరైనా ఉంటే అది కిరణ్ అబ్బవరం” అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆది వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు. ఏ చెప్పుతో కొట్టాలి రా నిన్ను అంటూ మీమ్స్ వేస్తున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడమేనా అని కొందరు.. నీ కెరీర్ లోనే అతిపెద్ద జోక్ అంటే ఇది అని మరికొందరు కామెంట్స్ పెట్టుకొస్తున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ కొంతమంది.. పవన్ లాంటివాడు ఒకడే ఉంటాడు. అతడిని దాటి వచ్చేవారు లేరు. మెగా హీరోలే ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. ఒక పవన్ అభిమానిగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్.. సిగ్గులేదు అని తిట్టిపోస్తున్నారు. ఇక మరికొందరు ఏమో గుర్రం ఎగరావచ్చు. రేపు ఎవరి జీవితం ఎలా ఉంటుందో చెప్పలేం కదా అని పాజిటివ్ గా చెప్పుకొస్తున్నారు.
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!