హైదరాబాద్ మెట్రోలో తరచుగా ప్రయాణాలు చేసే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై మెట్రోలో ఎంటర్టైన్మెంట్ అన్ లిమిటెడ్. ట్రావెలింగ్ లో ఫ్రీగా ఒక సినిమాను చూసేయొచ్చు. అంతేనా షాపింగ్ తో పాటు ఏదైనా సమాచారం కావాలన్నా, లేదా ఎంటర్టైనింగ్ కూడా సంబంధించిన కంటెంట్ ఏదైనా ఫ్రీగానే వీక్షించొచ్చు. అవసరమైతే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి షుగర్ బాక్స్ అనే సంస్థ మెట్రో ట్రైన్స్ లో హైస్పీడ్ ఇంటర్నెట్ ను మరింతగా విస్తృతం చేసింది.
Read Also : Avatar 2 : విడుదలకు ముందే యూనిక్ రికార్డు
నిజానికి 2019లోనే షుగర్ బాక్స్ సంస్థ హైదరాబాద్ మెట్రోతో అనుసంధానమైంది. అయితే ఇంతవరకూ లిమిటెడ్ గా ఇంటర్నెట్ ను ప్రొవైడ్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు అన్ లిమిటెడ్ గా, హైస్పీడ్ తో నెట్ సేవలను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో షుగర్ బాక్స్ సంస్థ హైస్పీడ్ కనెక్టివిటీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ, పేటెంటెడ్ క్లౌడ్ ఫ్రాగ్మెంట్ సాంకేతికతను దీనికోసం వినియోగించుకుంటున్నట్టు వెల్లడించారు. షుగర్ బాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మెట్రో రైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు ఫ్రీగానే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు వీక్షించొచ్చని షుగర్ బాక్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.