సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “సర్కారు వారి పాట”. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్‌గా ఈ చిత్రం నుంచి “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ సూపర్ స్టార్ అభిమానులనే కాకుండా అందరినీ ఆకట్టుకుంది. విడుదలైన 24 గంటల్లోనే షాకింగ్ వ్యూస్ తో తెలుగు సినిమా చరిత్రలో నిలిచింది. 25.7 మిలియన్ వ్యూస్, 754కే లైక్‌లతో టాలీవుడ్ లో అత్యధికంగా వీక్షించిన టీజర్‌గా నిలిచింది. విడుదలై నాలుగు రోజులు కావస్తున్నా “సర్కారు వారి పాట” దూకుడు ఇంకా తగ్గనేలేదు. తాజాగా ఇప్పటి వరకు ఈ టీజర్ కు వచ్చిన వ్యూస్ ను మేకర్స్ ప్రకటించారు. 30+ మిలియన్ వ్యూస్ సాధించిన ఈ “బ్లాస్టర్” ఇంకా టాప్ లోనే కొనసాగుతోంది.
Read Also : “అఖండ”లో ఆ సీన్స్ కోసమే ఏకంగా 80 రోజులు!
పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనుంది. టీజర్ తోనే సంచలనం సృష్టించిన మన ప్రిన్స్ సినిమా విడుదలైతే హడావుడి ఆ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మహేష్ అభిమానులకు వారి ఆశించిన పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రం 13 జనవరి 2022 న విడుదల కానుంది.