ఒకే ఏడాదిలో మినిమమ్ రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈ ఇయర్ ఆరంభంలో వాల్తేరు వీరయ్యతో సాలిడ్ హిట్ అందుకున్న మాస్ రాజా.. ఆ తర్వాత రావణాసురతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుగా దూసుకొస్తున్నాడు. స్టువర్టుపురం గజదొంగ జీవితకథ ఆధారంగా వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్డోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైగర్ టీజర్, సాంగ్స్ సినిమా పై మాసివ్ అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్ చేశారు. అక్టోబర్ 3న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ట్రైలర్ కన్నా ముందు మేము క్రియేట్ చేసిన ప్రపంచాన్ని చూడండి అన్నట్లుగా ‘స్టూవర్టుపురం’ గ్రామానికి సంబంధించిన కొన్ని మేకింగ్ స్టిల్స్, సెట్ వర్క్ కి సంబంధించిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు మేకర్స్. టైగర్ నాగేశ్వర రావుకి డెన్ లాంటి స్టూవర్టుపురం సెట్ ని భారీ ఖర్చుతో వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
A glimpse into the world of Stuartpuram & its HERO in 6 days 🔥
GET READY FOR THE BLAST ❤🔥#TigerNageswaraRao 🥷 TRAILER OUT ON OCTOBER 3rd 💥
Grand release worldwide on October 20th ❤️🔥@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh #RenuDesai… pic.twitter.com/cw7zPqppSj
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) September 27, 2023
ప్రస్తుతం టైగర్ ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మాస్ రాజా ఫ్యాన్స్. ఖచ్చితంగా ఈ సినిమాతో థియేటర్లో మాస్ జాతరేనని అంటున్నారు. కృతి సనన్ సిస్టర్ నుపూర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న… ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తోంది. అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1970 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వర రావు.. సినిమాపై గట్టి నమ్మకంతో ఉంది చిత్రయూనిట్. ఇక దసరాకు టైగర్‌గా రచ్చ చేయనున్న రవితేజ… సంక్రాంతికి ఈగల్‌గా రాబోతున్నాడు. మరి ఈ రెండు సినిమాలు రవితేజకు ఎలాంటి రిజల్ట్ అందిస్తాయో చూడాలి.